Normal Delivery: ప్రస్తుతం చాలా మంది సిజేరియన్ ద్వారానే పిల్లలను కంటున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికంటే సహజ ప్రసవం (Normal Delivery)యే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ నార్మల్ డెలివరీ వల్ల తల్లులు ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉండదని చెబుతున్నారు. శరీరాన్ని కోసి పిల్లలను బయటకు తీసే దానితో పోలిస్తే.. సాధారణ ప్రసవమమే చాలా బెటర్ అని వైద్యులు అంటున్నారు.
ఈ నార్మల్ డెలివరీ అవడం ఇప్పుడు చాలా తక్కువు. కానీ కొన్నిసలహాలు, సూచనలను పాటిస్తే మాత్రం నార్మల్ డెలివరీ అవడం సులభమే అంటున్నారు వైద్యులు. ఇందుకు ఏడో నెల నుంచే నడక, కొన్ని రకాల వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఆహారాల వల్ల సులభంగా నార్మల్ డెలివరీ అవుతుంది. డెలివరీకి ఇంకా నెల రోజులు సమయం ఉండగా ఈ పండ్లను తినాలని వైద్యులు చెబుతున్నారు.
పైనాపిల్: పైనాపిల్ పండును గర్భిణులు ఏడు నెలల వరకు అస్సలు తినకూడదు. 7 నెలలు దాటిన తర్వాత ఎలాంటి భయాలు లేకుండా పుష్టిగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు డౌటు ఉంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించి వీటిని తినాలో లేదో నిర్దారించుకోవచ్చు. ఈ పైనాపిల్ నార్మల్ డెలివరీ అవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో ఉండే బ్రోమేలైన్ అనే ఎంజైమ్ నార్మల్ డెలివరీ జరగడానికి బాడీని సిద్దం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పచ్చి బొప్పాయి: వాస్తవానికి బొప్పాయి పండును గర్భం దాల్చిన మొదట్లో అస్సలు తినొద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ డెలివరీ సమయం దగ్గరపడుతున్నప్పుడు మాత్రం వీటిని ఎలాంటి భయం లేకుండా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలను పప్పులో లేదా కూర వండుకుని తినొచ్చట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.. పండిన బొప్పాయిని అస్సలు తినకూడదు. వీటిని తినడం వల్ల ఏం లాభం కూడా లేదు. కాబట్టి పచ్చి బొప్పాయినే వండుకుని తినండి. దీనివల్ల మీ ప్రసవం సులువుగా అవుతుంది.
ఖర్జూరం: ఖర్జూర పండు మనకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గర్బంలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, బలంగా ఉండాలన్నా.. ఉదయం రెండు, సాయంత్రం రెండు ఖర్జూరాలను తినాలి. ఇందులో షుగర్ కూడా అధిక మొత్తంలోనే ఉంటుంది. ఇది నార్మల డెలివరీ అవడానికి ఎంతో సహాయపడుతుంది. అయితే కొంతమంది గర్భుణులకి Gestational diabetes వ్యాధి ఉంటుంది. అంటే గర్భిణులుగా ఉన్న సమయంలో షుగర్ వ్యాధి బారిన పడతారన్న మాట. కాగా ఈ వ్యాధి ఉన్న వారు ఖర్జూరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ షుగర్ వ్యాధి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది డెలివరీ తర్వాత దానంతట అదే పోతుంది. కానీ రేర్ గా కొంతమందికి మాత్రం ఇది లైఫ్ లాంగ్ ఉంటుందట.