
ఈ నెల 16న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. కాగా ఈ నెలలో వచ్చే పౌర్ణమి సందర్బంగా రాత్రి ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ చంద్రగ్రహణం కనిపిస్తుంది. పౌర్ణమి అనేది చంద్రుని దశ. ఇవి సుమారుగా ప్రతి నెలకు ఒకసారి చంద్రుడు అంతరిక్షంలో సూర్యుడికి ఎదురుగా ఉన్నప్పుడు భూమి మధ్యలో ఉన్నప్పుడు సంభవిస్తుంది.
పౌర్ణమి సమయంలో మన గ్రహానికి అభిముఖంగా ఉన్న చంద్రుని వైపు పూర్తిగా ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే ఇది ఒక పరిపూర్ణ వృత్తంలాగే కనిపిస్తుంది. Technically చంద్రుడు ఒక క్షణ కాలలం మాత్రమే నిండుగా ఉంటాడు. అంటే మేలో 15-16 తేదీ రాత్రిన ఇలా జరుగుతుంది. Old Farmer's పంచాంగం (Almanac) ప్రకారం.. మే 16 చంద్రుడు మధ్యాహ్నం 12:15 గంటలకు లేదా 15 తేదీనా రాత్రి 9:15 గంటలకు అత్యంత ప్రకాశవంతంగా మారుతాడు.
బ్లడ్ మూన్ అంటే ఏమిటీ.. "Blood moon" సైంటిఫిక్ పదం కాదు. కానీ ఇది సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు.
చంద్రుడు సూర్యుని నుంచి భూమికి వ్యతిరేక దిశలలో ఉన్నప్పుడు , భూమి యొక్క నీడ చంద్రునిపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. ‘చంద్రుడు సౌర్ణమి దశలో ఉన్నప్పుడు, అలాగే సూర్యుడు, భూమి, చంద్రుడు సరిగ్గా సమలేఖనం లో ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుందని’ గ్రీనిచ్ లోని రాయల్ అబ్జర్వేటరీకి చెందిన ప్లానిటోరియం ఖగోళ శాస్త్రవేత్త తానియా డి సేల్స్ మార్క్వెస్ న్యూస్ వీక్ లో అన్నారు.
అయితే ప్రతినెలా పౌర్ణమి వచ్చినప్పుడు ప్రతినెలా మనం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడలేము. చంద్రుడు వంగిన కక్ష్యాతలంపై భూమిని పరిభ్రమిస్తున్నందన భూమి తన నీడను కోల్పోతుందని అన్నారు.
సంపూర్ణ చంద్రగ్రహణాలు మూడు దశలుగా ఉంటాయి. ఒకటి చంద్రుడు భూమి యొక్క తేలికపాటి నీడలోకి (పెనుంబ్రా) ప్రవేశించినప్పుడు పెనుంబ్రల్ గ్రహణం కాంతి మసకగా మాత్రమే కనిపిస్తుంది. ఇక రెండోది భూమి యొక్క చీకటి నీడలోకి (ఉంబ్రా)ప్రవేశించడం ప్రారంభించినప్పుడు పాక్షిక గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కాంతి మసకగా కనిపిస్తుంది. ఇక చివరి దశ సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మొత్తం చంద్రుడు భూమి ఉంబ్రాలో ఉంటాడు. ఆ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు.
‘సంపూర్ణ గ్రహణ దశ తర్వాత చంద్రుడు ఆకాశంలో సాధారణ పౌర్ణమి చంద్రుడి లాగే కనిపించే వరకు మళ్లీ పాక్షిక, పెనుంబ్రల్ గ్రహణ దశల గుండా ప్రయాణిస్తాడు’ అని మార్క్వెస్ అంటున్నారు.
చంద్రుడు భూమి యొక్కక ఉంబ్రా గుండా ప్రయాణించినప్పుడు సూర్యకాంతి ఉపరితలాన్ని చేరినప్పుడు ప్రకాశవంతంగా ఉండదు. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా మారడానికి కారణం ఏంటో తెలుసా.. చంద్రుడిని చేరుకునే ఏకైక కాంతి సూర్యకాంతి మాత్రమే. అది భూమి వాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు చెల్లా చెదురుగా ఉంటుంది. ఈ సమయంలో ఎరుపు తరంగదైర్ఘ్యాల కంటే నీలి తరంగదైర్ఘ్యాలు ఎక్కువ చెల్లాచెదురుగా ఉంటాయి. దాంతో చంద్రుడిని కేవలం ఎరుపు కాంతి మాత్రమే చేరుకుంటుందని మర్క్వెస్ అంటున్నారు.
సూర్యోదయం, సూర్యస్తమయం సమయంలో ఆకాశం ఎర్రగా కనిపించడానికి కూడా ఇదే కారణమని మార్క్వెస్ అంటున్నారు. ఈ గ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మనదేశంలో లేదు.. కనుక ఈ గ్రహణ సమయాన్ని సూతకాలంగా పరిగణించరు.