Lunar Eclipse 2022: మొదటి చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అంతా శుభమే జరుగుతుంది..

Published : May 10, 2022, 10:32 AM ISTUpdated : May 10, 2022, 10:40 AM IST

Lunar Eclipse 2022: ఈ ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం (Lunar Eclipse) ఈ నెల 16 న ఏర్పడనుంది. అయితే ఈ మొదటి చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది.   

PREV
16
Lunar Eclipse 2022: మొదటి చంద్రగ్రహణం ఈ రాశుల వారికి అంతా శుభమే జరుగుతుంది..

Lunar Eclipse 2022: ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటిది ఈ నెల(మే) 16 ఏర్పడనుండగా..  రెండో చంద్రగ్రహణం 2022 నవంబర్ 2 న ఏర్పడనుంది. ఇకమొదటి చంద్రగ్రహణం 16 మే 2022న  ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో చంద్రగ్రహణం ప్రభావం పాక్షికంగానే ఉండనుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖం మే 16న పూర్ణిమ జరుపుకుంటారు.
 

26

ఈ మొదటి చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ దీనిని మనం చూడలేము. ఇది  ఇండియాలో కనిపించదు. కానీ కొన్ని రాశులపై దీని ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఏయే రాశుల వారిపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడునుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

36

వృశ్చిక రాశిలో.. ఈ మొదటి చంద్రగ్రహణం వృశ్చిక రాశిలో ఏర్పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.  గ్రహణం రోజున ఏర్పడే గ్రహాలు మూడు రాశుల వారికి అనుకూలంగా ఉండబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి ఏయే రాశుల వారికి ఈ చంద్రగ్రహణం అనుకూలంగా ఉండబోతోందో తెలుసుకుందాం పదండి.. 
 

46

మేషం.. మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం అన్ని విధాల కలిసొస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారం లో మంచి లాభాలొస్తాయి. ఇక ఉద్యోగులు పై స్థాయికి వెళతారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. వీరు అందరి పట్ల సానుకూలంగా, మర్యాదగా నడుచుకుంటారు. ఇకపోతే ఈ చంద్రగ్రహణం పెట్టుబడులకు బాగా అనుకూలిస్తుంది. 

56

సింహం.. ఈ చంద్రగ్రహణం సింహ రాశివారికి అన్నీ శుభాలనే కలిగిస్తుంది. ముఖ్యంగా  ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వీరి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.  అంతేకాదు వీరి ఫ్యామిలీలో కలహాలు, కొట్లాటలు అన్ని పోయి సంతోషంగా ఉంటారు. 
 

66

ధనుస్సు.. ధనుస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఈ రాశి వారికి మంచి అవకాశాలు అందుకుంటారు. ఇవి వారి పురోగతికి ఉపయోగపడుతుంది. ఉద్యోగులు పై స్థాయికి వెలతారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి. ఆదాయం కూడా బాగుంటుంది.  

 

click me!

Recommended Stories