వరుసగా రెండు రోజులు నిద్రపోకపోతే ఏమవుతుందో తెలుసా?

First Published | Jun 20, 2024, 9:53 AM IST

మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. నిద్రతోనే అలసిపోయిన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. నిద్రలోనే సగం వ్యాధులు నయమవుతాయని డాక్టర్లు చెప్పిన మాట వినే ఉంటారు. అయితే చాలా మంది సరిగ్గా నిద్రపోరు. దీనివల్ల ఏమౌతుందో తెలుసా?

Image: Getty

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం మంచి ఆహారాలను తినడంతో పాటుగా కంటి నిండా నిద్రపోవాలి. అవును నిద్ర మన శరీరానికి అత్యవసరం. నిద్రే మనల్ని ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. అలసి సొలసిన శరీరం కూడా నిద్రతో మళ్లీ శక్తివంతంగా మారుతుంది. అయితే కొంతమంది కొన్ని కారణాల వల్ల రోజు మూడు రోజులు కూడా నిద్రపోరు. కానీ ఇలా మీరు నిద్రపోకుండా ఉంటే ఏమౌతుందో తెలుసా? 
 

మనిషికి ఎంత నిద్ర అవసరం? 

చిన్నపిల్లలు 10, 12 గంటలు నిద్రపోతుంటారు. ఇక యువకులు, మధ్యవయసు వాళ్లలో కొంతమంది ఐదారు గంటలే నిద్రపోతే.. మరికొంతమంది ఏడెనిమిది గంటలు నిద్రపోతుంటారు. నిపుణుల ప్రకారం.. వయోజనులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. దీనికంటే తక్కువ నిద్రపోతే మీరు ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. 


శరీరానికి హానికరం

కొంతమంది వివిధ కారణాల వల్ల సరిగ్గా నిద్రపోరు. కానీ ఈ అలవాటు వారిని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. ఒక వ్యక్తి వరుసగా 2 రోజులు నిద్రపోకపోతే అతని శరీరం ఎంతో ప్రభావితమవుతుంది. ముఖ్యంగా ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. కంటిన్యూగా రెండు రోజులు నిద్రపోకపోతే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

అలసటగా అనిపించడం

శరీరానికి తగిన విశ్రాంతి లేకపోతే బద్దకంగా మారుతారు. అలాగే మీరు వరుసగా 2 రోజుల పాటు నిద్రపోకపోతే  ఉదయం నుంచి సాయంత్రం వరకు అలసటగానే ఉంటారు. దీనివల్ల మీకు ఏ పనీ చేయాలనిపించదు. 

ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది

మన ఆలోచనా సామర్థ్యం బాగుంటేనే మనం అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం. అయితే మనకు తగినంత నిద్ర లేనప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు దాని గురించి సరిగ్గా ఆలోచించలేము. అలాగే దానివల్ల మీకు ఎప్పుడూ నిద్రపోవాలని అనిపిస్తుంది. 

పెరిగిన ఒత్తిడి

ఒత్తిడి ఒక మానసిక సమస్య. ఇది కేవలం మీ మానసిక ఆరోగ్యాన్నే కాకుండా.. శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కంటిన్యూగా రెండు రోజులు నిద్రపోకపోవడం వల్ల మీరు బాగా ఒత్తిడికి గురవుతారు. అలాగే మీ శరీరం బలహీనంగా అనిపిస్తుంది కూడా. 

గుండెపై చెడు ప్రభావం

ముందే ఈ రోజుల్లో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మీరు కంటినిండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా నిద్రపోకపోతే మీకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఊబకాయం

రాత్రిపూట సరిగ్గా  నిద్రపోకపోతే శరీర బరువు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవును నిద్ర ఒకవ్యక్తి ఊబకాయాన్ని పెంచుతుంది. మీ శరీర బరువు పెరగకూడదంటే రోజుకు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. 
 

Latest Videos

click me!