ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు
ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. అయితే మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు, ఇబ్బందులు గనుక ఉంటే ప్రతిరోజూ కర్పూరాన్ని కాల్చడం మర్చిపోకండి. ఎందుకంటే దీనివలల్ మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక లాభాలను చూస్తారు.
జీవిత సమస్యల నుంచి బయటపడతారు
జీవిత సమస్యలు మనల్ని ప్రశాంతంగా ఉండనీయవు. అయితే క్రమం తప్పకుండా ఇంట్లో కర్పూరాన్ని కాల్చితే జీవిత సమస్యలు, కుటుంబ సభ్యుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఇది మీకు ప్రగతి మార్గాన్ని కూడా చూపుతుంది.