ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్ గా ఉండేందుకు ఏం తింటాడో తెలుసా?

Published : Dec 05, 2024, 10:48 AM IST

  అల్లు అర్జున్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా ఫిట్ గా కూడా ఉంటారు. మరి ఆయన  ఎప్పుడూ అంత ఫిట్ గా , అందంగా కనిపించడానికి వెనక కారణం ఏంటి? ఆయన ఏం తింటారో ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
16
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఫిట్ గా ఉండేందుకు ఏం తింటాడో తెలుసా?

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా పుష్ప2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సంగతి పక్కన పెడితే… అల్లు అర్జున్ లుక్స్ కి, ఫిట్నెస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

 

అల్లు అర్జున్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా ఫిట్ గా కూడా ఉంటారు. మరి ఆయన  ఎప్పుడూ అంత ఫిట్ గా , అందంగా కనిపించడానికి వెనక కారణం ఏంటి? ఆయన ఏం తింటారో ఇప్పుడు తెలుసుకుందాం..

 

26

 

మన రోజు మొత్తంలో బ్రేక్ ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. దానిని పొరపాటున కూడా స్కిప్ చేయకూడదు. ఈ రూల్ ని అల్లు అర్జున్ బాగా ఫాలో అవుతారట. తన బ్రేక్ ఫాస్ట్ చాలా హెల్దీగా ఉండేలా చూసుకుంటారట. ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారట. హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ తనను రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుందట. తన బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా  కోడిగుడ్డు ఉండేలా చూసుకుంటాడట. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మజిల్ రిపేర్ కీ, మజిల్ గ్రోత్ కి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

 

36

 

ఇక లంచ్ లో ఆయన బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకుంటారట. అందులో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారట. ఎక్కువగా గ్రిల్డ్ చికెన్ ని లంచ్ లో భాగం చేసుకుంటూ ఉంటారట. ఇది మజిల్ బిల్డ్ చేయడానికి, మెటబాలిజం మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

 

46
Allu Arjun

 

అల్లు అర్జున్ స్కిన్ ఎప్పుడూ  చాలా గ్లోగా ఉంటుంది. దానికోసం ఆయన తన డైట్ లో ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు ఉండేలా చూసుకుంటారట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా సహాయం చేస్తాయి. అంతేకాదు.. చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేయడంలోనూ సహాయం చేస్తాయి.

 

56


 

రెగ్యులర్ గా ఆయన సీజనల్ ఫ్రూట్స్ కూడా తన డైట్ లో తీసుకుంటూ ఉంటారట. పండ్లు, పండ్ల రసాల కారణంగా ఎప్పటికప్పుడు ఆయన రీఫ్రెషింగ్ గా కనిపిస్తూ ఉంటారు. లంచ్ సమయంలో ఎక్కువగా ఫ్రూట్ షేక్స్  తాగడానికి ఇష్టపడుతూ ఉంటారట. వీటిలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు… బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది.

 

66


 

ఇక.. తన డిన్నర్ మాత్రం చాలా లైట్ గా ఉండేలా చూసుకుంటారట. అయితే.. ఫైబర్ మాత్రం కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట. ఎక్కువగా బ్రౌన్ రైస్, గ్రీన్ బీన్స్, సలాడ్, కార్న్ లాంటివి తీసుకుంటారట. కచ్చితంగా డిన్నర్ లో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని ఎంచుకుంటారట. 




 

Read more Photos on
click me!

Recommended Stories