సోషల్ మీడియాను వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Jun 2, 2024, 11:03 AM IST

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితం సోషల్ మీడియా చుట్టూతా తిరుగుతోంది. జనాలు ఈ వెబ్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. ఇంకేముందు ఒక్కక్షణం సోషల్ మీడియాను వాడకుండా జనాలు బతకలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియాను వాడితే మీకు ఏం జరుగుతుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? 

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్లను వాడతున్నారు. ఫోన్ల వాడకంతో సోషల్ మీడియా వాడకం నేటి జీవనశైలిలోఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది లేకుండా జనాలు ఒక్కక్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. కానీ చాలా మంది ఫోన్ అవసరానికి మించి వాడున్నారు. కానీ అతి ఆరోగ్యానికి అనారోగ్యం. ఇది సోషల్ మీడియా వాడకానికి కూడా వర్తిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడటం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. 

2019 సంవత్సరంలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం.. రోజుకు కనీసం 3 గంటలు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టీనేజర్లలో నిరాశ, యాంగ్జైటీ, కోపం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అసలు సోషల్ మీడియాను ఎక్కువగా వాడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


బరువు పెరగడం

ఫోన్, సోషల్ మీడియా వ్యసనం బాగా పెరిగింది. దీనివల్ల జనాలు కూర్చున్న దగ్గర నుంచి అస్సలు కదలడం లేదు. చాలా మంది తినేటప్పుడు కూడా రీల్స్ ను, వీడియోలను చూస్తూనే ఉంటారు. దీనివల్ల ఎంత తింటున్నారో కూడా తెలియదు. దీనివల్లే చాలా మంది బరువు పెరిగిపోతున్నారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ఇది ఎన్నో వ్యాధులకు దారితీస్తుంది. 

phone

ఏకాగ్రత, స్పష్టత తగ్గడం

సామాజిక మాధ్యమాల్లో నిజాలు, అబద్దాలు రెండూ ఉంటాయి. కానీ జనాలకు ఇవేవీ తెలియవు. కానీ ఇవి మన మెదడును ప్రభావితం చేస్తాయి. మీరు చూసేటివన్నీ మెదడులో స్టోర్ అవుతాయి. ఇది మీ దృష్టిని తగ్గిస్తుంది. మెయిల్స్, మెసేజ్లు, నోటిఫికేషన్లు, కాల్స్, టెక్స్ట్ మెసేజ్ల లోడ్ వల్ల ఒక విషయం గురించి ప్రశాంతంగా ఆలోచించే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మనసు ఎప్పుడూ అస్తవ్యస్తంగా ఉంటుంది.
 

mobile addiction

ట్రెండింగ్ షీప్ ట్రిక్

ట్రెండింగ్ లో ఉన్న పనులు చేయడానికి సోషల్ మీడియా ఒక గొప్ప సాధనం. అది బట్టలైనా, ఆహారమైనా, ఫ్యాషన్ అయినా లేదా పాటలైనా కావొచ్చు. ప్రతి ఒక్కరిలో ట్రెండింగ్ థీమ్ కు అనుగుణంగా రీల్స్ లేదా వీడియోలు చేయడానికి బాగా పోటీ పడతారు. కానీ ఈ ట్రెండింగ్ షీప్ ట్రిక్ తో యువత తమ విలువైన సమయాన్ని,  వర్తమానాన్ని, భవిష్యత్తును వృథా చేసుకుంటున్నారు.
 


నిద్ర లేమి

ఈ రోజుల్లో నిద్రపోయేటప్పుడు ఫోన్ ను చెక్ చేసుకుంటేనే నిద్రపోయే అలవాటు దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఒక్కోసారి గంటల తరబడి రీల్స్ ను చూడటం వల్ల ఏ అర్థరాత్రో నిద్రపోతున్నారు. కానీ ఇది నిద్రలేమి, ఇతర నిద్ర రుగ్మతలకు దారితీస్తుంది.

phone

గోప్యతకు భంగం 

సోషల్ మీడియాలో జనాలు వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంటారు. ఏది తింటున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారు వంటి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో వెళ్లడిస్తూనే ఉంటారు. కానీ ఇది హ్యాకింగ్, ఫోటోల దుర్వినియోగం, ఇతర గోప్యతకు భంగం కలిగించే ఘటనలకు దారితీస్తుంది.

Latest Videos

click me!