చాలా మంది బయట కనిపించిన చిరుతిండ్లను ఇంట్లోకి తెచ్చి కిచెన్ లో కంటికి స్పష్టంగా కనిపించేలా పెడుతుంటారు. ఇక వంటింట్లోకి వెళ్లినప్పుడల్లా అవి కనిపిస్తే మన మనస్సు ఊరుకుంటదా.. వాటిని తినాలని మనసు లాగుతుంటది. ఇంకేముంది వాటిని అందుకుని దర్జాగా తినేస్తుంటాం.. దీని వల్ల కూడా వెయిట్ పెరిగే అవకాశముందని పలు అధ్యయానాలు చెబుతున్నాయి. కాబ్టటి మీ వంటింటి నుంచి బిస్కెట్లు, స్నాక్స్, చిరుతిండ్లు, చిప్స్ వంటివి ఉండకుండా చూసుకోండి. అయితే ఒకవేళ మీకు స్నాక్స్ తినాలనిపిస్తే ఇంట్లో చేసుకున్నవే చేసుకుని మితంగా తినండి. అంతేకాదు మీ కిచెన్ లో ఆరోగ్యానికి మంచి చేసే గింజలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉండేలా చూడండి.