Weight Loss Tips: డైటింగ్ చేసే వారు ఈ కూరగాయలు తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..

First Published Aug 13, 2022, 4:56 PM IST

Weight Loss Tips: ఎలా బరువు తగ్గేదని బెంగ పెట్టుకున్నారా..? మీకు తెలుసా.. ఈ కూరగాయలను తింటే వేగంగా బరువు తగ్గుతారు. 
 

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య సర్వసాధారణంగా మారిపోయింది.  కానీ ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉండే అదనపు కొవ్వు ఎన్నో సమస్యలను పుట్టిస్తుంది. అందుకే వీలైనంత తొందరగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. అయితే బరువు తగ్గేందుకు కొంతమంది వ్యాయామం చేస్తే మరికొంతమంది మాత్రం డైట్ ను ఫాలో అవుతుంటారు. ఇంకొంతమంది ఈ రెండింటినీ ఫాలో అవుతుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కొన్ని కూరగాయలను రోజూ తినాలి. ఎందుకంటే ఇవి మీ బరువును వేగంగా తగ్గిస్తాయి. ఇంతకీ బరువు తగ్గాలనుకునే వారు రోజూ తినాల్సిన కూరగాయలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డైటింగ్ చేసేవారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలను తినొచ్చు. ఉదయం పూట కూరగాయలతో చేసిన స్మూతీని తీసుకుంటే ఫాస్ట్ గా బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందుకోసం క్యారెట్ స్మూతీని తీసుకోవచ్చు. లేదా దుంపలు, టొమాటో జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకునే ఏ కూరగాయ అయినా ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆ కూరగాయల్లోనే విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము వంటివి ఎక్కువ మొత్తంలో ఉండాలి. కానీ ఈ స్మూతీలను రెగ్యులర్ గా తీసుకోవాలి. అప్పుడే ప్రయోజనాన్ని పొందుతారు. 
 

ఇక మధ్యాహ్న భోజనంలో సలాడ్ ను తీసుకోండి.  క్యారెట్లు, దోసకాయలు, టమోటాలు వంటి వివిధ రకాల కూరగాయలతో సలాడ్లు తయారుచేసి తీసుకోవచ్చు. ప్రతి రోజూ మధ్యాహ్నం పూట అన్నాన్ని తినడం తగ్గించండి. ఎక్కువగా సలాడ్లు తీసుకోండి. లేదా ఉడకబెట్టిన కూరగాయలను తినండి. కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఇనుము వంటి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇక సాయంత్రం పూట వెజిటబుల్ సూప్ ను తీసుకోవచ్చు. రకరకాల కూరగాయలతో సూప్ తయారు చేయండి. ఎందుకంటే కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్, కాల్షియంతో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది అన్ని సంక్లిష్టతలను తొలగించి.. బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు రాత్రి 1 గిన్నె ఉడకబెట్టిన కూరగాయలను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వీటిని నూనె లేకుండానే ఉడికించాలి.

ఇక రాత్రిపూట roasted cauliflower ని తినొచ్చు. దీన్ని తక్కువ నూనెతోనే తయారుచేసుకోవాలి. ఇది మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇకపోతే కాలీఫ్లవర్ లోని అనేక పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతిరోజూ రాత్రిపూట వివిధ రకాల కూరగాయలను తినొచ్చు. 

వీటితో పాటుగా ప్రతిరోజూ నీళ్లను పుష్కలంగా తాగండి.  7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే శరీరం అనారోగ్యం బారిన పడుతుంది. డైటింగ్ చేసేటప్పుడు నీటిని పుష్కలంగా తాగితేనే వేగంగా బరువు తగ్గుతారు. ఇలాంటి సమయంలో చాలా మంది డీహైడ్రేషన్ తో బాధపడుతుంటారు. ఇది మంచిది కాదు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు శరీరం నుంచి బయటకు పోతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, వేగంగా బరువు తగ్గడానికి నీరు ఎంతో సహాయపడుతుంది. 

click me!