స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వించదగ్గ రోజు. ఎందరో అమరవీరుల త్యాగఫలం కారణంగానే మనం ఈ నాడు ఇంత స్వేచ్చగా జీవిస్తున్నాం.. మన దేశానికి స్వాతంత్య్రాన్ని అందించడం కోసం పోరాటం చేసిన అమరులకు నివాళులు అర్పించే రోజు ఇది. ఈ సందర్బంగా మీ ఫ్యామిలికీ, ఫ్రెండ్స్ కు, బంధువులకు విషెస్ తెలిపేందుకు కొన్ని కోట్స్ మీకోసం..
జాతి తల్లులకు స్ఫూర్తినిచ్చే ప్రేమ, త్యాగాలు అనే అలుపెరగని ఆదర్శాల్లో దేశం గొప్పతనం దాగి ఉంది. - సరోజినీ నాయుడు
మీ దేశం మీ కోసం ఏమి చేయగలదో అడగకండి. మీ దేశం కోసం మీరేం చేయగలరో అడగండి.- జవహర్ లాల్ నెహ్రూ
రైతుల కుటీరం నుండి నాగలిని పట్టుకొని గుడిసెల నుంచి చెప్పులు కుట్టేవాడు, ఊడ్చేవాడి నుంచి కొత్త భారతదేశం ఉద్భవించనివ్వండి. – స్వామి వివేకానంద
సూర్యుడు తన మార్గంలో ఈ దేశాన్ని మించిన స్వేచ్ఛగా, మరింత సంతోషంగా, మరింత సుందరంగా, ఈ దేశాన్ని మించిన దేశాన్ని సందర్శించాలి!" - సర్దార్ భగత్ సింగ్
'మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచుదాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
'ఎన్నో త్యాగాల తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించింది. దాన్ని మనం ఎనాడూ తేలికగా తీసుకోకూడదు." స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
స్వేచ్చను ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేం. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా కొన్ని వందల సంవత్సరాల తరబడి సాగిన పోరాటం ద్వారే ఈ మహత్తర రోజు లభించింది. మన దేశం కోసం పోరాడిన వారందరినీ స్మరించుకుందాం. జై హింద్!'
'మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సైనికులందరికీ పాదాభివందనం!.. జై హింద్!'
మన గతం ఎంతో అమూల్యమైనది. ఆదర్శవంతమైనది. దీనిని ఎన్నటికీ మర్చిపోకూడదు. మన స్వేచ్ఛను కాపాడటానికి, దీనిని భవిష్యత్ తరాలకు అందించడానికి ఏం చేయాలో ప్రతిదీ చేద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!'
స్వేచ్ఛకు రంగులు ఉండవు. ఆకారాలు కనిపించవు. ప్రప౦చ౦లో ద్వేష౦, దౌర్జన్య౦ రాజ్యమేలుతున్నాయి.. వీటిని అంతం చేసేందుకు ఇప్పుడు మనం కలిసికట్టుగా ఉండాలి. ప్రేమ, ఐక్యత, అవగాహనతో ని౦డిన మెరుగైన భవిష్యత్తును నిర్మి౦చుకుందాం... స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
మన స్వాతంత్ర్య సమరయోధులు మనకు స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఆగస్టు 15 న వారిని గుర్తుచేసుకుని నివాళులు అర్పిద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!'
మనలో ఏ ఒక్కరూ ఒకలా లేరు. కానీ మనల్ని ఏకం చేసేందుకే ఒకటి ఉంది. అదే స్వాతంత్య్రం దినోత్సవం. ఇంతటి గొప్ప విషయాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. స్వాతంత్య్రం కోసం మన పెద్దల కష్టాన్ని ఏనాడూ మర్చిపోకూడదు. ఈ అందమైన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆస్వాదిద్దాం..
ఈ ప్రత్యేకమైన రోజున రేపటి మీ కొత్త కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
మనం ఎవరు.. ఇక్కడికి ఎలా వచ్చాము.. అన్ని విషయాలను పునరాలోచించుకోవాల్సిన సమయం ఇండిపెండెన్స్ డే. జై హింద్!'
'అమరవీరుల త్యాగాలకు సెల్యూట్ చేద్దాం.. మనకు ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ..