ఉదయం పరిగడుపున ఈ నీటిని తాగితే మీ ఊబకాయం వెన్నలా కరిగిపోతుంది..

First Published Nov 19, 2022, 9:49 AM IST

పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
 

ప్రస్తుత కాలంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ ఊబకాయం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఊబకాయం అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందుకే ఊబకాయం మరింత పెరిగిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమస్య ఉంటే.. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలి. 

బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, షుగర్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను అసలే తినకూడదు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి పసుపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..పసుపు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయని నిరూపించబడింది. రోజూ ఉదయం పరిగడుపున పసుపు నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గేందుకు పసుపు నీరు ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు నీటిలో పాలీఫెనాల్స్, కర్కుమిన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడతాయి. జీవక్రియ రేటు పెరిగితే బరువు తగ్గడం సులువు అవుతుంది. ప్రతిరోజూ పసుపు నీటిని తాగితే రోగనిరోధక శక్తి  బలంగా ఉంటుంది. తరచుగా అనారోగ్యానికి గురయ్యే వారికి ఇది మంచి మెడిసిన్ లాంటిది. 

బరువు తగ్గడానికి పసుపు నీటిని ఇలా తయారుచేయండి.. 

ముందుగా ఒక గ్రాము పసుపును తీసుకోండి. దీన్ని రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ తర్వాత నీటిని వడకట్టి దానిలో కొద్దిగా తేనెను కలపండి. అయితే పసుపు నీటిని తయారుచేయడానికి పసుపు పౌడర్ ని కాకుండా.. పసుపు కొమ్ములను ఉపయోగించండి. ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే ఈ నీటిని ప్రతిరోజూ పరిగడుపున తాగాలి. మధ్యాహ్నం  భోజనంలో పసుపును తీసుకోవచ్చు.
 

పసును నీరు బరువు తగ్గేందుకు సహాయపడటమే కాదు.. మీ పేగు కదలికలను కూడా మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం నుంచి బయటపడేస్తుంది. ఈ పసుపు జీర్ఱక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియను పెంచుతుంది. పసుపు శరీరానికి హాని చేసే టాక్సిన్లను తొలగిస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చర్మ సమస్యలను, ముడతలు నెమ్మదిగా వచ్చేలా చేస్తాయి. అలాగే ఇది చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. పసుపు నీరు మన రోగనిరోధక వ్యవస్థను కూడా బలంగ ఉండటానికి సహాయపడుతుంది. 

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే.. గుండెకు సంబంధించిన రోగాలు వస్తాయి. అయితే పసుపు నీటిని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ వెన్నలా కరిగిపోతాయి. అంతేకాదు ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అల్జీమర్స్ వాధిని, ఆకక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపు మంటను కూకడా తగ్గిస్తుంది. ముఖ్యంగా ముసలివాళ్లలో కీళ్ల నొప్పులను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 

click me!