Weight Loss Tips: ఈ 5 మసాలా దినుసులతో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా..

Published : Apr 22, 2022, 12:40 PM IST

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో ఓవర్ వెయిట్ తో బాధపడేవారి సంఖ్య బారిగా పెరిగిపోయింది. అయితే బరువును తగ్గించేందుకు ఐదు రకాల మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..   

PREV
19
Weight Loss Tips: ఈ 5 మసాలా దినుసులతో ఈజీగా బరువు తగ్గొచ్చు తెలుసా..
weight loss

Weight Loss Tips: ఈ ఆధునిక కాలంలో అధిక బరువు, ఊబకాయం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ ఓవర్ వెయిట్ కారణంగా ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటున్నారు.

29

బరువు తగ్గాలనుకునే వారు.. ఈ ప్రాసెస్ ను ఎలా? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలన్న సంగతిని పక్కన పెట్టండి. ఎందుకంటే మీ వెయిట్ లాస్ ప్రక్రియను మీ వంట గదినుంచే ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఇందుకోసం మీరు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో  పాటుగా ప్రతిరోజూ వ్యాయామం చేయాలని చెడుతున్నారు. ఈ రెండు పద్దతులు మీరు త్వరగా బరువు తగ్గేలా చేస్తాయి. 

39

మసాలా దినుసులతో ఈజీగా బరువు తగ్గుతారు.. ఇంట్లోనూ, ఆఫీసులోనూ కదలకుండా ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇక ఈ ఓవర్ వెయిట్ ను తగ్గించుకోవాలనుకునే వారు మీ రోజు వారి ఆహారంలో కొన్ని సుగంధ ద్రవ్యాలను, మూలికలను చేర్చుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. మరి ఆ సుగంధ ద్రవ్యాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

49

సుగంధ ద్రవ్యాల ప్రయోజనాలు.. మసాలా దినుసులు అనేక ఔషదగుణాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాదు ఇవి వంటలకు రుచిని కూడా పెంచుతాయి. ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుంచి మనల్ని కాపాడుతాయి కూడా. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా ఈ మసాలా దినుసులను తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు. 

59

మెంతులు.. మెంతి గింజలు ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. మెంతులను గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారుచేసి అందులో ఒక టీ స్పూన్ తేనెను కలపండి. దీన్ని ఉదయం పరిగడుపున తీసుకుంటే బెల్లీ ఫ్యాట్, అధిక బరువు సులభంగా తగ్గుతుంది. అయితే గర్భిణులు మాత్రం మెంతులను తీసుకోకూడదు. 

69

అల్లం.. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో విటమిన్లు, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. పచ్చి అల్లం రసం లేదా కొంచెం అల్లం ముక్కను నమలడం లేదంటే కూరల్లో వేసుకుని తినడం లేదా కషాయం తయారుచేసుకుని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

79

దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క బరువును తగ్గించే ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది. అంతేకాదు ఇది జీవక్రియ (Metabolism)ను మెరుగుపరిచే పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ ను కూడా నియంత్రిస్తుంది. దాల్చిన చెక్క టీ లేదా కాషాయం లేదా కూరల్లో తీసుకున్నా మీరు సులువుగా బరువు తగ్గుతారు. 
 

89

లవంగాలు.. లవంగాలు కూడా బరువును తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో జీర్ణశక్తి బలోపేతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ లవంగాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. 
 

99

సోంపు.. ఆకలిని తగ్గించడానికి సోంపు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగానే ఉన్న భావన కలుగుతుంది. అంతేకాదు అతిగా తినడం వల్ల ఎదురయ్యే.. అజీర్థి, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. సోంపు టీ లేదా కూరగాయల్లో కలిపి దీన్ని తీసుకోవచ్చు. అలాగే ప్రతి రోజూ ఉదయం పూట సోంపు వాటర్ ను కూడా తాగొచ్చు. సోంపులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బరువును తగ్గించడానికి సహాయపడతాయి. 
 

click me!

Recommended Stories