మొలకెత్తిన ఉల్లిపాయలను తినడం మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారంటే..

Published : Apr 22, 2022, 10:37 AM IST

Onion Health Benefits: ప్రతి వంటగదిలో ఉల్లిపాయలు పక్కాగా ఉంటాయి. అయితే ఈ ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొలకలు వస్తుంటాయి. ఇక వాటిని ఏ ఒక్కరూ తినడానికి ఇష్టపడరు. కారణం వాటిని తింటే లేనిపోని రోగాలు చుట్టుకుంటాయని. నిజానికి మొలకెత్తిన ఉల్లిపాయలను తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.   

PREV
17
మొలకెత్తిన ఉల్లిపాయలను తినడం మంచిదా? కాదా? నిపుణులు ఏమంటున్నారంటే..

Onion Health Benefits: ఉల్లిపాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషదమే చెప్పాలి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ (Heat stroke) బారిన పడకుండా కాపాడుతుంది. హెల్త్ పరంగానే కాదు .. బ్యూటీకి కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 

27

కొంతమంది జుట్టు సంరక్షణ కోసం ఉల్లిపాయలను తరచుగా వాడుతుంటారు. ఇందుకోసం.. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తుంటారు. దీన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ షైనీగా మారడమే కాదు.. పొడుగ్గా కూడా  పెరుగుతుంది.  

37

ప్రతి కూరలోనూ,  బిర్యాన్నీల్లోనూ తప్పకుండా ఉల్లిపాయలను వెయ్యడానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే.. ఉల్లిపాయలు వంటలకు మంచి టేస్ట్ ను తీసుకొస్తాయి. అందుకే ప్రతి వంటగదిలో ఇవి తప్పకుండా ఉంటాయి. అయితే ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొలకలు వస్తుంటాయి. దీంతో చాలా మంది ఇవి ఇక పనికిరావంటూ వాటిని చెత్తబుట్టల్లో వేస్తుంటారు.  నిజానికి మొలకెత్తిన ఉల్లిపాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

47

మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. వీటిని మీరు తీసుకుంటే విటమిన్ సి లోపం తొలగిపోతుంది. అంతేకాదు ఈ విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే మొలకెత్తిన ఉల్లిని పారేయకుండా.. బేషుగ్గా తినండి. 

57

మొలకెత్తిన ఉల్లిపాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యస్థ పనితీరును మెరుగుపర్చడమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. అంతేకాదు ఇది కడుపు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది. కాబట్టి వీటిని మొలకలు వచ్చాయి కదా అంటూ పక్కన పెట్టేయకండి.  
 

67

ఈ ఉల్లిపాయల్లో ఫాస్పరస్, కాల్షియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను, దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. కాబట్టి వీటిని మీ రోజు వారి డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. 

77

ఇకపోతే ఈ సీజన్ లో మొలకెత్తిన ఉల్లిగడ్డలను తింటే శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంతేకాదు వీటిని తింటే చలువ చేస్తుంది. ఈ ఉల్లిపాయలను సలాడ్ గా చేసుకుని తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా పొట్ట చల్లగా ఉంటుంది. 

click me!

Recommended Stories