మారుతున్న జీవన శైలి కారణంగా.. ప్రమాదకరమైన రోగాలు సైతం ఇప్పుడు కామన్ గా మారాయి. అందులోనూ ప్రస్తుతం ఏ జబ్బులూ లేని వ్యక్తులు నూటికి ఒక్కరు కూడా ఉంటారో లేదో కూడా చెప్పలేము. అధిక రక్తపోటు నుంచి రక్తంలో చక్కెర, బరువు పెరగడం వంటి సమస్యలు ప్రస్తుతం సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి.
వీటన్నింటికీ ప్రధాన కారణం ప్రజలు చేసే కొన్ని మిస్టేక్స్ వల్లే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తప్పుల వల్లే విపరీతంగా బరువు పెరుగుతున్నారట. అంతేకాదు ఎన్నో రోగాల బారిన కూడా పడుతున్నారు. బరువు అదుపులో ఉంటే ఎటువంటి రోగాలు సోకే అవకాశమే ఉండదు. అయితే కొన్ని కారణాల వల్లే బరువు విపరీతంగా పెరుగుతున్నారట. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
బయటి ఫుడ్ ను తినడం.. బరువు పెరగడానికి అతిపెద్ద కారణం ఇదే. బయట తినడం వల్లే చాలా మంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆకలేసిందని ఫాస్ట్ ఫుడ్ ను తింటే బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది. అంతేకాదు బయటిఫుడ్ తినడం వల్ల ఎన్నో వ్యాధులకు మీరు వెల్కమ్ చెప్పినట్టే మరి.
రాత్రంతా మేల్కొనే ఉండటం.. తెల్లవార్లూ మేల్కొనే ఉండే అలవాటు వల్ల కూడా మీరు విపరీతంగా బరువు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ప్రస్తుతం యువత రాత్రంతా మేల్కొవగానే ఉండి ఎప్పుడో తెల్లవారు జామున నిద్రపోతున్నారు. ఈ అలవాటు మూలంగానే ఓవర్ వెయిట్ బారిన పడతారు. ఎందుకంటే రాత్రిళ్లు మెలుకువగా ఉండటం వల్ల ఆకలి కలుగుతుంది. దాంతో ఏది దొరికితే అది తింటారు. దీంతో మీరు విపరీతంగా బరువు పెరుగుతారు. అందుకే ఈ అలవాటును మానుకోవడం బెటర్.
कोल्ड ड्रिंक
కూల్ డ్రింక్స్ తాగడం.. కూల్ డ్రింక్స్ తాగే అలవాటు కూడా మీ బరువును మరింత పెంచుతుంది. అందులోనూ వేసవిలో కూల్ డ్రింక్స్ ను విచ్చలవిడిగా తాగుతుంటారు. ఈ శీతల పానీయాల్లో సుక్రోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెల్లి ఫ్రక్టోజ్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాదు దీనిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో మీరు బాగా బరువు పెరిగిపోతారు.
గంటతరబడి ఒకే దగ్గర కూర్చోవడం.. మారుతున్న జీవనశైలికి తోడు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల విపరీతంగా బరువుపెరిగిపోతున్నారు. ఒకే దగ్గర రోజంతా కూర్చోవడం వల్ల శారీరక కార్యకలాపాలు తగ్గుతాయి. ఇది మీ బరువును పెంచుతుంది. అంతేకాదు ఈ అలవాటు వల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.