Best Calcium Rich Foods: ఒంట్లో కాల్షియం లోపించిందో ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..

Published : Apr 30, 2022, 02:03 PM ISTUpdated : Apr 30, 2022, 02:05 PM IST

Best Calcium Rich Foods: మన శరీరానికి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియంతోనే ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఒకవేళ ఒంట్లో కాల్షియం లోపిస్తే ఏమౌతుందో తెలుసా...? 

PREV
19
Best Calcium Rich Foods: ఒంట్లో కాల్షియం లోపించిందో ఈ సమస్యలొస్తయ్ జాగ్రత్త..
calcium

Best Calcium Rich Foods: మన శరీరానికి కావాల్సిన ముఖ్యమమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపించడంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. అంతేకాదు ఇది కండరాలు, హార్మోన్ల రిలీజ్, సంకోచ వ్యాకోచాలకు కూడా ఉపయోగపడుతుంది. 

29

ముఖ్యంగా ఈ కాల్షియం అస్థిపంజర పనితీరుకు ఎంతో అవసరం. కాల్షియం పుష్కలంగా ఉన్నప్పుడు అస్థిపంజరం పనితీరు మెరుగ్గా ఉంటుంది. కానీ ప్రస్తుతం చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. 

39
calcium

కాల్షియం లోపాన్ని  ‘Hypocalcemia’ అని వైద్య  పరిభాషలో అంటారు. Hypocalcemia కు తగిన సమయంలో వైద్యం చేయించుకోకపోతే ప్రమాదకరమైన ఎముకలు సన్నబడే రోగం బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు పిల్లల్లో కాల్షియం లోపిస్తే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి బారిన కూడా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం నుంచి బయటపడొచ్చు. 

49

కాల్షియం లోపం లక్షణాలు.. 

కాళ్లు, పాదాలు, వేళ్లలో జలదరింపుగా ఉండటం లేదా తిమ్మరి కలుగుతుంది. 

కండరాల తిమ్మిరి

ప్రతిదానికి అలసిపోవడం, బద్దకంగా అనిపించడం

గోర్లు పెళుసుగా మారడం, బలహీనంగా తయారవడం

దంత సమస్యలో బాధపడటం

దంతాలు ఆలస్యంగా రావడం

కన్ఫ్యూ జ్ అవడం

పూర్తిగా ఆకలి మందగించడం

59

ఎముకలకు బలాన్ని ఇస్తుంది: తాటి ముంజలలో క్యాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా (Bones Strong) మారుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
 

69

కాల్షియం లోపించడం వల్ల శరీరంలోని ఇతర భాగాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మీలో కాల్షియం లోపం లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్దారించుకోండి. దీనినుంచి బయటపడటానికి మెడిసిన్స్ ను ఉపయోగించండి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో కాల్షియం లోపం నుంచి బయటపడొచ్చు. అవేంటంటే.. 

79

పాలు, పెరుగు, జున్ను, పనీర్, రసమలై వంటి ఆహారాల్లో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. కూరగాయలైన పాలకూర, బచ్చలికూర, బఠానీలు ,తృణధాన్యాలు బీన్స్ వంటివి తీసుకుంటూ ఉండండి. 

89

సీఫుడ్స్ లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే గుడ్లు, మాంసాహారంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారికి ఖర్జూర పండ్లు మేలు చేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఎంతో సహాయపడతాయి. 
 

99

మన శరీరంలో కాల్షియం పుష్కలంగా ఉంటేనే ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. మన ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం నిటారుగా నిలబడుతుంది.  దంతాలు, గుండె ఆరోగ్యానికి కూడా కాల్షియం ఎంతో అవసరం. కాబట్టి కాల్షియం లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. 

click me!

Recommended Stories