Black Thread: చేతికి, కాలికి నల్లదారం కట్టుకుంటున్నారా? ఈ తప్పు మాత్రం చేయద్దు..!

Published : Apr 15, 2026, 03:15 PM IST

 Black Thread: చేతికి కానీ, కాలికి కానీ, లేదా మెడలో కానీ నల్ల దారం కట్టుకునే అలవాటు ఉందా? దిష్టి తగలకూడదని ఇలాంటివి కట్టుకుంటూ ఉంటారు. కానీ, ఆ దారం కట్టుకొనేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. 

PREV
13
Black Thread

భారతీయ సంస్కృతిలో నల్ల దారాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు.. సానుకూల శక్తిని ఆకర్షించడానికి, నెగిటివ్ ఎనర్జీ కి దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే.. వాస్తు ప్రకారం ఈ నల్లదారం కట్టుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

23
నల్లదారం ఏ రోజున ధరించాలి?

వాస్తు శాస్త్రం ప్రకారం, నల్లదారాన్ని తయారు చేసే, ధరించే సమయం చాలా ముఖ్యం. శుక్రవారం ఈ నల్లదారం తయారు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే..ఈ నల్లదారాన్ని శనివారం ధరించడం అత్యంత ప్రభావవంతంగా పరిగణిస్తారు.

ఎన్ని ముడులు వేయాలి?

నల్ల దారాన్ని తయారు చేసేటప్పుడు ఏడు ముడులు వేయాలి. ఇలా ఏడు ముడులు వేయడం వెనక కూడా కారణం ఉంది. ఏడు సంఖ్య ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ప్రతి ముడితో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏడు ముడులు వేసినప్పుడు ఆ దారం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

33
ఎప్పుడు కట్టుకోవాలి?

శని వారాల్లో మర్రి చెట్టు లేదా మర్రి చెట్టు నీడలో నల్ల దారాన్ని ధరించడం సరైన పద్ధతి. ఎడమ వైపు ప్రతికూల శక్తి నుండి రక్షణకు అవసరం అని నమ్ముతారు. కాబట్టి, దానిని ఎడమ చేతికి లేదా ఎడమ కాలికి కట్టుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు.

ఈ రాశులవారు కట్టుకోకూడదు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేష, సింహ , వృశ్చిక రాశులలో జన్మించిన వారు నల్ల దారాన్ని ధరించే ముందు సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశులు సూర్యుడు , అంగారకుడితో సంబంధం కలిగి ఉంటాయి. వీరికి నలుపు రంగు అనుకూలంగా ఉండదు. కాబట్టి.. ఈ రాశులవారు నలుపు రంగు దారం కట్టుకోకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories