ప్రస్తుత కాలంలో మన దేశంలో క్యాన్సర్ అత్యంత సాధారణ వ్యాధుల్లో ఒకటిగా మారిపోయింది. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీన్ని ఫస్ట్ స్టేజ్ లో గుర్తించడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. కానీ దీని లక్షణాలు అంత సులువుగా బయటపడవు. రోగం ముదిరినంకనే దీని లక్షణాలు కనిపిస్తాయి. అందుకే చాలా మంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఏ ఒక్క ఆహారం కూడా నేరుగా క్యాన్సర్ ను నిరోధించనప్పటికీ.. ఆహారంలోని కొన్ని భాగాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి, తగ్గిస్తాయి. కొన్ని ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు పండ్లు, కూరగాయలు, ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలను రోజూ తినండి. అయితే మాంసాహారం, స్వీట్లు, ఉప్పు, ఆయిలీ, ఫ్యాటీ ఫుడ్స్ ను మితంగా తీసుకోవడం మంచిది. వీటివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. చలికాలంలో మీరు కొన్ని ఆహారాలను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.