చాలా మందికి స్లీవ్ లెస్ బట్టలను వేసుకోవడం ఇష్టముంటుంది. కానీ చంకల్లో నలుపుదనం వల్ల వాటిని వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ నలుపును పోగొట్టొచ్చంటున్నారు నిపుణులు.
మహిళలు ఎదుర్కొనే చర్మ సమస్యలలో చంకలు నల్లగా ఉండటం ఒకటి. స్లీవ్ లెస్ బట్టలను వేసుకోవాలని ఇష్టం ఉన్నా ఈ సమస్య కారణంగా చాలా మంది వీటిని పక్కన పెడుతుంటారు. చర్మ సమస్యల నుంచి హార్మోన్ల మార్పుల వరకు చంకల్లో చర్మం నల్లగా ఉండటానికి కారణమవుతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో చంకల్లో నలుపు రంగును పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
26
బంగాళదుంప రసం
చంకల్లోని నలుపు రంగును వదిలించుకోవడానికి బంగాళాదుంప రసం బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం బంగాళాదుంపలను తీసుకుని వాటి తొక్క తీసి మిక్సీ పట్టాలి. దీన్నుంచి రసాన్ని వేరుచేయాలి. ఈ రసాన్ని చంకల్లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చంకల్లో నలుపు రంగు మటుమాయం అవుతుంది.
36
కలబంద
కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చంకల్లో నలుపు రంగును ఎఫెక్టీవ్ గా తొలగించడానికి సహాయపడతాయి. ఇందుకోసం అలోవెర జెల్ ను తీసుకుని చంకల్లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే నలుపురంగు పోతుంది.
46
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. చర్మపు ముదురు రంగును తొలగించడానికి సహాయపడుతుంది. దీని కోసం మీరు నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకుని అందులోో ఒక టీస్పూన్ బేకింగ్ సోడాను కలపండి. ఈ మిశ్రమాన్ని చంకలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. కొబ్బరి నూనె మీ చంకలను తెల్లగా చేస్తుంది.
56
underarm
శెనగపిండి
శనగపిండిని, కొద్దిగా బియ్యప్పిండి, పసుపు మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నలుపు రంగు ప్రాంతాల్లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది కూడా నలుపు దనాన్ని సులువుగా తొలగిస్తుంది.
66
ఓట్ మీల్
కొద్దిగా ఓట్ మీల్ తీసుకుని అందులో తేనె, పసుపు, నిమ్మరసం, పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న చంకల్లో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ పద్దతిని రోజూ పాటిస్తే మీ చంకలు తిరిగి తెల్లగా అవుతాయి.