పిల్లలకు ఆకలి ఎందుకు తగ్గుతుంది? వాళ్లు బాగా తినాలంటే ఏం చేయాలి?

First Published | Aug 1, 2024, 4:44 PM IST

చాలా మంది పిల్లలు తినడానికి మారం చేస్తుంటారు. అలాగే పెట్టినా తినరు. ఎందుకంటే ఆకలి అవ్వడం లేదని చెప్తుంటారు. కానీ దీనివల్ల పిల్లలు అనారోగ్య బారిన పడటమే కాకుండా బాగా బరువు తగ్గిపోతారు. అసలు పిల్లల ఆకలి పెరగడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పిల్లలకు తరచుగా ఆకలి అవుతుంటుంది. దీంతో పిల్లలు ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం అస్సలు తినరు. ఎందుకంటే ఆకలి లేదని చెప్తుంటారు. కానీ పిల్లలు తినకపోవడం వల్ల బక్కగా మారుతారు. బలం కూడా ఉండదు. అలాగే అనారోగ్యసమస్యలు కూడా వస్తుంటాయి. దీనివల్ల పిల్లలు తినడానికి తల్లులు రకరకాల వంటలు కూడా చేస్తుంటారు. అయినా పిల్లలు తినకపోవడంతో బాగా భయపడిపోతుంటారు. పిల్లలు సరిగా తినకపోతే టానిక్ ఇచ్చి ఎక్కువ తినేలా చేయొచ్చని హాస్పటల్స్ కూడా పోతుంటారు చాలా మంది. కానీ పిల్లల ఆకలిని పెంచడానికి టానిక్ అవసరమే లేదు. 

child-food

పిల్లల ఆకలిని పెంచడం సాధ్యమేనా?

పిల్లవాడు తినకపోయినా వాళ్ల ఎదుగుదల మాత్రం నిలకడగా ఉంటుంది. అలాగే మీరు సపరేట్ గా వాళ్ల ఆకలిని పెంచాల్సిన అవసరం  కూడా లేదు. అయితే పిల్లల సమతుల్య అభివృద్ధిలో  ఆకలిని పెంచడం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకు అతిగా తినిపిస్తే ఊబకాయం బారిన పడతారు. మీ పిల్లల పెరుగుదల స్థిరంగా ఉంటే వారికి మీరు ఆకలిని పెంచాల్సిన అవసరం లేదు. 


child food

పిల్లల పెరుగుదల లేకుంటే ఏం చేయాలి? 

మీ పిల్లవాడు సాధారణంగా రోజూ తినే ఆహారం మొత్తాన్ని అకస్మాత్తుగా పెంచలేం. పిల్లల ఆకలి అనేది వారికి సహజంగా రావాల్సిన విషయం. పిల్లలకు ఆకలి లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటంటే? 

1. అనారోగ్యం కారణంగా ఆకలి లేకపోవడం
2. చురుకుగా ఉండటం వల్ల ఆకలి లేకపోవడం

పిల్లలు బాగా ఆడుకుని అలసిపోవడం, ఏ ఆటల్లో  పాల్గొనకపోవడం లేదా  పెరుగుదల సరిగ్గా రేటును కలిగి ఉండటం నిజంగా వ్యాధి ద్వారా ప్రభావితమవుతుంది. పోషకాహార లోపం,  సంక్రమణ కారణంగా పిల్లల శరీర బరువు పెరగకపోవచ్చు. ఇది నిజమైన ఆకలి. టానిక్ ఇవ్వడం వల్ల పిల్లలకు అయ్యేలా చేయలేరు. అందుకే మీ పిల్లలకున్న వ్యాధేంటో గుర్తించి వైద్యం చేయిస్తేనే పిల్లకు ఆకలి అవుతుంది. 

Child's Appetite

కొంతమంది పిల్లలు ఎంత ఇచ్చినా తింటూనే ఉంటారు. అంటే 100 మంది పిల్లల్లో 10 మంది మాత్రమే ఇలా ఉంటారు. అయితే పిల్లల దృష్టి మొత్తం ఎక్కువగా ఆడుకోవడం, బయటకు వెళ్లడంపైనే ఉంటుంది. పిల్లల ఎదుగుదల నిలకడగా ఉన్నప్పటికీ వారికి సమయానికి అన్నం పెట్టాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అయితే పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఆకలి వేస్తే వారే అడుగుతారు. అప్పుడు పెట్టినా సరిపోతుంది. కానీ ఎప్పుడూ పిల్లలు తినాలనుకోకండి. 

Watch out for less appetite:In some cases, a person may withdraw from taking normal food and may as his or her body may refuse the intake as the inner system may have sent signals that it no longer requires fuel for the body to keep running.

నెలల వయసున్న చిన్న పిల్లలు ఆకలి అయినప్పుడు బాగా ఏడుస్తారు. పాలిస్తే ఏడుపును మానేస్తారు. ఆకలి కానీ పిల్లలు ఉండరు. అయితే ఆకలి వేయక ముందే తల్లిదండ్రులు అన్నం పెట్టడం మంచిది కాదు. పిల్లలకు కొంచెం లేట్ గా కూడా ఆకలి కావొచ్చు. అలాగే పిల్లలకు సెల్ ఫోన్లు, టీవీల్లో కార్టూన్లు చూపించి వారి దృష్టి మరల్చి తినిపించడం మంచి పద్దతి కాదు. 

Right colour: Bright colours like -yellow, orange, and red, are known to stimulate our appetites the most. These colours, especially red, increase our blood pressure and heart rate, making us feel hungrier. However, grey, black, brown, and purple are considered as an appetite suppressant. By having food in plates of these colours, the chances of overeating decreases.

దీనివల్ల మీరు మీ పిల్లల్ని ఊబకాయం బారిన పడేసిన వారవుతారు. పిల్లల ఎదుగుదల నిలకడగా ఉండి, వారికి ఎలాంటి వ్యాధి లేకుండా ఉంటే మీరు వారి ఆకలి పెంచాల్సిన అవసరం లేదు. తక్కువ బరువుంటే వారికిచ్చే పోషకాహారాన్ని పెంచండి సరిపోతుంది.

Latest Videos

click me!