విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం
మీరు ఒత్తిడికి గురైనప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీకు సెక్స్ కోరికలు కూడా తగ్గుతాయి. నిపుణుల ప్రకారం.. ఒత్తిడి మీ లైంగిక సంతృప్తిని తగ్గిస్తుంది. అలాగే మీ సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తుంది. ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్ లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం బయట కాసేపు నడవడం, ధ్యానం చేయడం, వ్యాయామం చేయడం లేదా స్నేహితులతో మాట్లాడటం వంటివి చేయండి.