
సీజనల్ ఫ్రూట్స్ ను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నుంచి తప్పించుకోవచ్చు. ఇక ఈ వేసవిలో పుష్కలంగా లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండును ఈ సీజన్ లో ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఎన్నో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే ఈ పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.
పుచ్చకాయతో ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని ముఖాకిని అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డంతా తొలగిపోతుంది. అలాగే స్కిన్ డ్రై నెస్ , మొటిమలు, మొటిమల తాలూకు మచ్చలన్నీ తొలగిపోతాయి. మరి ఫేస్ ప్యాక్ లను ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ, తేనె.. ముఖం పై కనిపించే వృద్ధాప్య ఛాయలను తొలగించడానికి పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి సన్ రేడియేషన్ నుంచి కూడా రక్షిస్తాయి.
ఇకపోతే తేనె బ్లాక్ హెడ్స్ ను, మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను, గోధుమ రంగు మచ్చలను తొలగించడానికి తోడ్పడుతుంది. ఇందుకోసం .. రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ రసంలో రెండు టేబుల్ స్పూన్ల తేనెను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్నిముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు అలాగే వదిలేసి.. ఆ తర్వాత మెత్తని క్లాత్ తో ముఖాన్ని క్లీన్ చేయండి. తరచుగా ఇలా చేస్తే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.
పుచ్చకాయ, పెరుగు.. ఈ రెండూ కూడా మనకు చులవ చేసేవే. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే.. మీ ముఖ అందం రెట్టింపు అవుతుంది. ఇందుకోసం.. రెండు టేబుల్ స్పూన్ల చొప్పున పుచ్చకాయ జ్యూస్ ను పెరుగును తీసుకుని మెత్తని పేస్ట్ మాదిరిగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల వరకు అలాగే ఉంచేసి.. ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా చేస్తే మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
పుచ్చకాయ , పాలు.. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి.. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి పాలు ఎంతో సహాయపడతాయి. ఈ ఎండలకు మీ చర్మం నిర్జలీకరణకు గురికాకుండా చేయడానికి ఎంతో తోడ్పడుతుంది. ఫేస్ ప్యాక్ కోసం.. కొన్ని పుచ్చకాయ ముక్కలను తీసుకుని పేస్ట్ లా చేయండి. అందులో రెండు టీస్పూన్ల పాలను మిక్స్ చేయండి. అలాగే ఇందులో విటమిన్ ఇ క్యాప్సుల్ ను కూడా ఆడ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
పుచ్చకాయ, కీరదోస కాయ.. కీరదోసలో, పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఇకపోతే టీస్పూన్ దోసకాయ పేస్ట్ లో కొద్దిగా పుచ్చకాయ రసం కలిపి ముఖానికి పట్టంచాలి. దీన్ని 15 నిమిషాలు అలాగే వదిలేసి.. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేస్తే.. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది.