Garlic Vastu: డబ్బు కష్టాలు తీరాలా? ఇంట్లో వెల్లుల్లిని ఈ ప్రదేశాల్లో పెట్టి చూడండి!

Published : Sep 10, 2026, 09:18 AM IST

Garlic Vastu: వెల్లుల్లిని వంటల్లోనే వాడతామనుకుంటాం కానీ.. దానితో కొన్ని వాస్తు చిట్కాలు కూడా పాటించవచ్చు. కొన్ని సాంప్రదాయ నమ్మకాల ప్రకారం వెల్లుల్లికి వంటకు మించిన శక్తులు ఉన్నాయట. ఇంట్లో సులభంగా పాటించగల వెల్లుల్లి వాస్తు చిట్కాలేంటో చూద్దాం.

PREV
13
వాస్తు ప్రకారం వెల్లుల్లి చిట్కాలు

వెల్లుల్లి ఆరోగ్యపరంగా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గుండె జబ్బుల నుంచి అనేక ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి ఒక దివ్యౌషధం. మన రోజువారీ జీవితంలో అనేక ప్రయోజనాలను అందించే రహస్యం కూడా వెల్లుల్లిలో దాగి ఉంది. వాస్తులో కూడా వెల్లుల్లిని ఉపయోగిస్తారు. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల డబ్బు సమస్యలు పోతాయి.

23
డబ్బు సమస్యలు తీర్చే చిట్కాలు

మీకు ఇంట్లో తరచుగా డబ్బు సమస్యలు వస్తున్నాయా? అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పుడుతుందా? అయితే, ఒక పూర్తి వెల్లుల్లిని గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని నమ్ముతారు.

అలాగే మంగళవారం రోజు వెల్లుల్లి చిట్కాను పాటిస్తే మంచిది. ఒక వెల్లుల్లి రెబ్బ కొనకు కుంకుమ పెట్టి, దాన్ని ఇంటి టెర్రస్ మీద పెట్టాలి. ఇది ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని తరిమికొట్టి, ప్రశాంతతను నింపుతుంది.

33
సుఖమైన జీవితం కోసం

శనివారం రోజు వెల్లుల్లి చిట్కాలను పాటించడం వల్ల సుఖ జీవితం దక్కుతుంది. ఒక వెల్లుల్లిని నల్లటి వస్త్రంలో చుట్టి, ఇంటి ప్రధాన ద్వారం బయట వేలాడదీయండి. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ సంతోషం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి.

అలాగే నిద్రపోయేటప్పుడు, ఒక వెల్లుల్లి రెబ్బను పడక దగ్గర పెట్టుకుంటే, మధ్యలో ఆగిపోయిన ఏ పనైనా పూర్తవుతుందని చెబుతారు వాస్తు నిపుణులు.

Read more Photos on
click me!

Recommended Stories