ఇంట్లో తులసి మొక్క ఉంటే ఎంతో మంచిది. అయితే కొందరి ఇళ్లల్లో తులసి చెట్టు చిన్నగా ఉంటుంది. త్వరగా పెరగదు. ఎత్తుగా పెరగకుండా, ఆకులు చిన్నగా ఉండి ఎండిపోతుంది. చిన్న మొక్కను గుబురుగా, పచ్చని పెద్ద ఆకులతో ఎలా పెంచాలో ఇక్కడ కొన్ని ట్రిక్స్ చెప్పాము అవి ఫాలో అయితే సరిపోతుంది.
మొక్కను ఒకే కొమ్మలా పైకి పెరగనివ్వకండి. మొక్క పైభాగంలో ఉండే చిన్న చిగురు ఆకులను గోటితో లేదా కత్తెరతో కత్తిరించండి. ఇలా ఒక చివర కత్తిరిస్తే, దాని పక్కనుంచి 2 కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మలను మళ్లీ పించ్ చేస్తే 4, ఆ తర్వాత 8 కొమ్మలు వచ్చి మొక్క కొద్ది రోజుల్లోనే గుండ్రంగా, గుబురుగా (Bushy) పెరుగుతుంది.
కుండీలోని మట్టికి తగిలేలా ఉండే ఆకులను వెంటనే తుంచేయండి. మట్టిలోని తేమ ఆకులకు తగిలితే మొక్కకు ఫంగస్ వచ్చి వేర్లు కుళ్లిపోతాయి.