Money Plant Grow tips: నీటి జాడీలో మనీ ప్లాంట్‌ను పచ్చగా పెరగాలా? ఈ చిన్న పని చేయండి చాలు

Published : Sep 10, 2025, 12:26 PM IST

మనీ ప్లాంట్ చూసేందుకు పచ్చగా, అందంగా ఉంటుంది. దీనికి మట్టి కూడా అవసరం లేదు. నీటి జాడీలో కూడా పెంచవచ్చు. మంచినీటిలో మనీ ప్లాంట్ ఎలా పెంచాలో తెలుసుకోండి. 

PREV
15
మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?

ఇంటిని అలంకరించేందుకు మనీ ప్లాంట్ ఎంతో అందంగా ఉంటుంది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని కూడా తీసుకొస్తుంది. చాలామందికి ఇంట్లో మట్టితో కూడిన కుండీలను ఉంచేందుకు ఇష్టపడరు. అలాంటివారు మనీ ప్లాంట్ ను కేవలం నీటి జాడీలోనే పెంచుతారు. నీటిలో పెంచే మనీ ప్లాంట్ పచ్చగా ఎదగాలంటే చిన్న చిట్కా ఉంది. దీన్ని పాటిస్తే చాలు మనీ ప్లాంట్ అందంగా పెరిగేస్తుంది.

25
టీ ఆకులు వేయడం వల్ల లాభాలు

మీరు మనీ ప్లాంట్ ను ఒక నీటి జాడీలో వేసి పెంచుతున్నప్పుడు అందులో కొన్ని టీ ఆకులను కూడా వేయండి. అందులో కొన్ని టీ ఆకులను వేస్తే చాలు మొక్క ఏపుగా పెరుగుతుంది. టీ ఆకులలో నైట్రోజన్, పొటాషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మొక్కల ఆకులు పచ్చగా తాజాగా ఉంచడానికి అవసరం పడతాయి. నేలలో పెరిగిన మనీ ప్లాంట్ కూడా టీ ఆకులను వేయవచ్చు.

35
ఎన్ని ఉపయోగాలు?

నీటిలో పెంచే మనీ ప్లాంట్ పై టీ ఆకులు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ నీటిలో గుప్పెడు తేయాకులను వేయండి. చాలు మనీ ప్లాంట్ అందంగా పెరగడం మీరు గమనిస్తారు. టీ ఆకులను జోడించడం వల్ల నీరు త్వరగా వాసన రాదు. అలాగే నీటిలో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి కూడా తగ్గుతాయి. దీనివల్ల మొక్క వేర్లు దెబ్బ తినకుండా ఉంటాయి. టీ ఆకులు నీటిలో పేరుకుపోయిన ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తాయి. దీనివల్ల మొక్కలు అందంగా పెరుగుతాయి.

45
ఇలా వేయండి

టీ ఆకుల నుండి మనీ ప్లాంట్ కు పూర్తి ప్రయోజనాలు అందాలంటే ముందుగా తేయాకులను నీటితో శుభ్రంగా కడిగి ఆరబెట్టండి. ఎండిపోయిన టీ ఆకులను మట్టితో కలిపి ఇతర మొక్కల పెంపకానికి వాడుకోవచ్చు. మనీ ప్లాంట్ లో నీటిని ప్రతి వారం రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఆ నీటిలో గుప్పెడు ఎండిన టీ ఆకులను వేయండి. మీకు మనీ ప్లాంట్ అందంగా ఎదగడం ప్రారంభమవుతుంది.

55
సూర్యకాంతి తగిలేలా

మనీ ప్లాంట్ ను ఎప్పుడైనా గాజు కూజా లేదా గాజు సీసాలోనే ఉంచడం మంచిది. ఎందుకంటే గాజు నుంచి సూర్యకాంతి ప్రసరిస్తుంది. అలాగే ఆ గాజు సీసాను సూర్యకాంతి ఎంతో కొంత పడేచోటా ఉంచితే మంచిది. అలాగే మొక్క వేర్లు మునిగేలా నీటి మట్టం ఉండాలి. అలాగే ఆ నీరు పరిశుభ్రంగా ఉండాలి. ఆ జాడీలో రాగి నాణేం వేయడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories