Mixer Grinder: మిక్సీ కొనాలనుకుంటున్నారా? బెస్ట్ మిక్సీల ధరలు, ఫీచర్లు చూడండి

Published : Nov 10, 2026, 05:10 PM IST

Mixer Grinder: ఇప్పుడు ప్రతి వంటగదిలో మిక్సీ కనిపిస్తుంది. పచ్చళ్ల దగ్గర నుంచి పొడుల వరకు ఏం చేయాలన్న మిక్సీ ఉండాల్సిందే. ఇప్పుడు ఆధునిక ఫీచర్లతో ఎన్నో మిక్సీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ మిక్సీల గురించి ఇక్కడ ఇచ్చాము.

PREV
14
Sujata Dynamix 900W

చట్నీ, మసాలా, పిండి లాంటివి అధికంగా రుబ్బేవారికి Sujata Dynamix 900W మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఇందులో 900W మోటార్‌తో పాటు మూడు జార్లు వస్తాయి. పెద్ద మొత్తంలో లిక్విడ్స్ కోసం 1.5 లీటర్ల జార్, డ్రై గ్రైండింగ్ కోసం 1 లీటర్ జార్, చట్నీ లాంటి చిన్న అవసరాలకు 500 ml జార్ ఉపయోగపడతాయి. ఇందులో డబుల్ బాల్ బేరింగ్ మోటార్ సిస్టమ్ ఉంటుంది. కంపెనీ స్పెసిఫికేషన్స్ ప్రకారం, 22,000 RPM వేగంతో తిరిగే ఈ మోడల్.. ఎక్కువ సమయం రుబ్బుతుంది. దీని ధర రూ.10,000 – రూ.11,000 వరకు ఉంటుంది.

24
Bosch TrueMixx Pro 1000W

మసాలా దినుసులు రుబ్బడానికి Bosch TrueMixx Pro 1000W మోడల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో 1000W మోటార్ ఉంటుంది. ముఖ్యంగా, డ్రై ఐటమ్స్ రుబ్బడానికి వీలుగా ప్రత్యేకమైన Pounding Blade ఇందులో ఉంటుంది. దీని Stone Pounding Technology, సంప్రదాయబద్ధంగా రోటిలో దంచినట్లుగా మసాలాలను పొడి చేసేలా రూపొందించారు. అలాగే, Active Flow Breaker టెక్నాలజీ పిండి రుబ్బడంలో సాయపడుతుంది. ఈ మోడల్‌లో 1.5 లీటర్ల వెట్ గ్రైండింగ్ జార్, 1 లీటర్ డ్రై గ్రైండింగ్ జార్, 400 ml చట్నీ జార్ అని మూడు జార్లు ఉంటాయి. దీని ధర  రూ.11,000 – రూ.14,000.

34
Philips HL7756 750W

రోజువారీ వంటలకు కావాల్సిన చట్నీ, మసాలా, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ లాంటివి తయారుచేసుకోవడానికి 750W కెపాసిటీ ఉన్న Philips HL7756 మోడల్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో మూడు స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు వస్తాయి. మూడు స్పీడ్ కంట్రోల్స్‌తో పాటు పల్స్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉంటుంది. మోటార్‌పై ఎక్కువ భారం పడినప్పుడు ఇది రక్షణగా నిలుస్తుంది. పెద్దగా రుబ్బే పనులు లేని సాధారణ ఇంటి అవసరాలకు ఈ మోడల్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ ధరకే రూ.3,000 – రూ.3,600 వస్తుంది.

44
Preethi Boltz 1000W

ఎక్కువ మోటార్ కెపాసిటీ ఉన్న మిక్సర్ గ్రైండర్ కోసం వెతికేవారు Preethi Boltz 1000W మోడల్‌ను పరిశీలించవచ్చు. ఇందులో 1000W మోటార్, నాలుగు జార్లు ఉంటాయి. మూడు స్పీడ్ కంట్రోల్స్‌తో పాటు పల్స్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. చట్నీ, మసాలా, తడి, పొడి ఐటమ్స్ రుబ్బడం లాంటి వివిధ వంట అవసరాలకు దీనిని వాడొచ్చు. ఒకే మిషన్ మీద రకరకాల రుబ్బే పనులు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. అయితే కొనే ముందు ఈ మోడల్‌తో వచ్చే నాలుగు జార్ల సైజులను కూడా చెక్ చేసుకోవాలి. దీని ధరలు రూ.5,500 – రూ.7,300 వరకు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories