పౌరసత్వం, నివాస ప్రయోజనాలు
విదేశాల్లో జన్మించడం వల్ల బిడ్డకు ఆతిథ్య దేశంలో పౌరసత్వం లేదా నివాస హక్కులు లభిస్తాయి. భవిష్యత్ విద్యా, ఉద్యోగం, ప్రయాణ అవకాశాలను అందిస్తాయి. తమ పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును కోరుకునే భారతీయులకు ఇది కీలకమైన పరిశీలనగా మారింది.
యూఎస్, కెనడా, గ్రేట్ బ్రిటన్ (యూకే) వంటి దేశాలు ఆకర్షణీయమైన పౌరసత్వ ప్రయోజనాలను అందిస్తాయి. దీంతో భారతీయ తల్లిదండ్రులకు ఈ దేశాలు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా మారాయి. అందుకే చాలా మంది తమ బిడ్డలను ఈ లోకంలోకి స్వాగతం పలికేందుకు ఆయా దేశాలకు వెళ్తున్నారు.