Viral Fever: వర్షాకాలంలో వైరల్ ఫీవర్ భయం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..!

Published : Aug 06, 2022, 04:10 PM IST

Viral Fever: వర్షాకాలంలో సంకమించే కొన్ని రకాల వ్యాధులు ప్రాణాంతకంగా ఉంటాయి. అందుకే వీటిని లైట్ తీసుకోవద్దు. ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు.   

PREV
111
 Viral Fever: వర్షాకాలంలో వైరల్ ఫీవర్ భయం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్..!

వర్షాకాలంలో జోరుగా వానలతో పాటుగా ఎన్నో రకాల రోగాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే జబ్బులు, జ్వరం కూడా వేగంగా సోకుతాయి. అయితే ఈ సీజన్ లో జలుబు కావడం సాధారణ విషయం. వారం రోజుల్లో అదే నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతుంది. కానీ జ్వరం అలా కాదు. జ్వరం ప్రాణాంతకం. వైరల్ ఫీవర్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వారికే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

211

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతుంటారు. అందుకే దీని లక్షణాలేంటో తెలుసుకుని.. ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడం మంచిది. 

311

వైరల్ ఫీవర్ లక్షణాలు

జలుబు, దగ్గు, కడుపు నొప్పి, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ఎందుకంటే ఇవి వైరల్ ఫీవర్ లక్షణాలు కాబట్టి..
 

411

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

మీకు జలుబు చేస్తే.. తుమ్ముటప్పుడు ఖచ్చితంగా చేతి రుమాలును గానీ.. టిష్యూను గానీ ఉపయోగించండి. శానిటైజర్ ను కూడా యూజ్  చేయండి.  లేదంటే చేతులను గోరు వెచ్చని నీరు, సబ్బుతో వాష్ చేసుకోండి. 

511

ఇంట్లో వేపాకుతో పొగ వేయడం వల్ల ఇంట్లో ఉన్న దోమలు బయటకు పోతాయి. అలాగే క్రిమి కీటకాలు కూడా చనిపోతాయి. అందుకే వీటితో పొగ వేయండి.
 

611

ఏమి తినాలి..? 

ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. అయితే పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. ఇందుకోసం విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, మోసంబి వంటి పండ్లను ఎక్కువగా తినండి. ఇవి రకరకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తాయి. అయితే మీకు జలుబు ఉంటే మాత్రం ఈ పండ్లను తినకూడదు. 
 

711

నీటి ద్వారా ఎన్నో రకాల రోగాలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే నీళ్లను మరిగించి మాత్రమే తాగండి. లేదంటే నీటిలో ఉండే క్రిములు ఎన్నో రోగాకలు దారితీస్తాయి. 
 

811

మీ రోజు వారి ఆహారంలో జలుబుకు కారణమయ్యే ఆహారాలకు బదులుగా శరీర వేడిని పెంచే ఆహారాలను తినండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కారాన్ని ఎక్కువగా తినకూడదు. 

లవంగాలు, బెల్లం, సోంపు, సెలెరీ, పసుపు, అల్లం వంటి ఆహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి. అంతేకావు ఇవి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను, అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి కూడా.. 
 

911

వానాకాలంలో నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలను కూడా తీసుకోవాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. 

1011

వాంతులు, విరేచనాలుంటే.. నిమ్మకాయ నీటిని తాగితే ఉపశమనం పొందుతారు. అలాగే అల్లం టీ, తులసి టీ తాగితే ఆరోగ్యం బాగుంటుంది. 

1111

ఏమి తినకూడదు

ఫ్రిజ్ వాటర్ ను  గానీ, ఫ్రిజ్ లో పెట్టిన ఫుడ్ ను గానీ అసలే తినకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ లో పెట్టిన మిగిలిన ఆహారంలో శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories