విజయ్ సేతుపతి పరిచయం అవసరం లేని పేరు. ఆయన దక్షిణాదిన అన్ని సినిమాల్లోనూ అవకాశాలు అందుకొని అదరగొడుతున్నారు. ఓ వైపు హీరోగా చేస్తూనే, మరో వైపు విలన్ రోల్స్ కూడా పోషిస్తున్నారు. రీసెంట్ గా జవాన్ మూవీలో స్టైలిష్ విలన్ గా నటించి, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా తన సత్తా చాటాడు. నిజానికి, ఇండస్ట్రీలో ఉన్నవారు., ముఖ్యంగా హీరోలుు ఫుడ్ విషయంలో చాలా ఆంక్షలు పెట్టుకుంటూ ఉంటారు. అవి తింటే లావు అయిపోతాం. ఇవి తినకూడదు ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. అయితే, విజయ్ సేతుపతి మాత్రం తనకు నచ్చిన ఆహారాన్ని తినేస్తూ ఉంటారట.