ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం ఒక కీలక ఘట్టం. పెళ్లైన వారు ఆ అనుభూతిని ఎప్పుడో రుచి చూసే ఉంటారు. చాలా మంది ప్రతిరోజూ కూడా దీనిని ఆస్వాదిస్తూనే ఉంటారు. అయితే... మీరు ప్రతిరోజూ ఎంజాయ్ చేసే సెక్స్ విషయంలో మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఆస్వాదించే శృంగారం.. సెక్స్ లేదా.. మేకింగ్ లవ్..?
మనం సాధారణంగా శృంగారాన్ని ఇంగ్లీష్ లో సెక్స్ అని పిలుస్తాం. దీనిని కొంచెం డీసెంట్ గా మేకింగ్ లవ్ అని కూడా పిలుస్తాం. ఈ రెండూ ఒకటే అని అనుకుంటాం. కానీ ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉందట. ఆ తేడా ఏంటో గుర్తించి.. మీరు అనుభవిస్తున్న శృంగారం ఏ కోవకు చెందిందో తెలుసుకోండి.
ఫీలింగ్స్, మనసుతో సంబంధం లేకుండా.. కేవలం.. శారీరక కలయికను ఆస్వాదించడాన్ని సెక్స్ అంటారు. సెక్స్ చేయడానికి ఎదుటివారిపై ఎలాంటి ప్రేమ, ఫీలింగ్స్ అవసరం లేదు. కానీ.. ఎదుటి వారిపై మనకు ప్రేమ అనే ఫీలింగ్ ఉండి.. ఆ తర్వాత కలయికను ఆస్వాదించడాన్ని మేకింగ్ లవ్ అంటారు.
క్యాజువల్ సెక్స్ గురించి మీరు వినే ఉంటారు. ముఖ పరిచయం లేని వ్యక్తితో ఒక రోజు గడపడాన్ని క్యాజువల్ సెక్స్ అంటారు. ఈ సెక్స్ లో.. ఎదుటివారిపై ఫీలింగ్స్ ఉండవు. దీనిని సెక్స్ అనే అంటారు. అలా కాకుండా.. ఒకే వ్యక్తితో.. తరచూ సెక్స్ లో పాల్గొంటూ ఉంటే.. వారిపై ఫీలింగ్స్ కలుగుతాయి. కాబట్టి దానిని మేకింగ్ లవ్ అంటారు.
కొందరు.. చాలా మందితో సెక్స్ ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ప్రేమ ఉండదు. కానీ.. పర్టిక్యులర్ గా ఒకే ఒక వ్యక్తితో సెక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటే.. అది మేకింగ్ లవ్ కిందకు వస్తుంది.
కొందరు కేవలం.. శారీరక తృప్తిని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వారికి తమతో గడిపే వ్యక్తి ఎవరు అనే సంబంధం ఉండదు. అది క్యాజువల్ సెక్స్ కిందకు వస్తుంది. అలా కాకుండా.. కేవలం ఒక వ్యక్తితో మాత్రమే సెక్స్ చేయాలనే కోరిక కలిగితే..అది ప్రేమతో కూడా ఉందని గుర్తించాలి.
ఓ వ్యక్తి సెక్స్ సమయంలో మీ మనసులోని ఆనందాన్ని, బాధను షేర్ చేసుకోగలుగుతున్నారు అంటే అది ప్రేమతో కూడినదే. అలా షేర్ చేసుకోలేకపోతున్నారు అంటే.. అది క్యాజువల్ సెక్స్ కిందకే వస్తుంది.