Valentine Day 2022: నేను సింగిల్ అని బాధపడుతున్నారా? అయితే వీటిని మీరు ఖచ్చితంగా చేయాల్సిందే..

First Published | Feb 14, 2022, 10:08 AM IST

Valentine Day 2022: ప్రేమ అమరం, ఆనందం, అద్బుతం. అందుకే పెద్దలంటారు ఒకరి చేత ప్రేమించబడితే మనకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరని. ఇకపోతే ఈ రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైదని. ఈ రోజు ప్రేమ పక్షులంగా ఏకాంత సమయంలో తమ ప్రేయసి లేదా ప్రియుడితో ఎన్నో ఊసులు చెప్పుకుంటూ సమయాన్ని ఆనందంగా గడుపుతుంటారు. అయితే ఈ రోజున కూడా కొంతమంది సింగిల్ గానే ఉంటారు. అలా మీరు కూడా ఉన్నారా? మీ ఒంటరితనాన్ని తరిమికొట్టే సింపుల్ టిప్స్ మీ కోసం.. 
 

Valentine Day 2022: ఫిబ్రవరి 14 యువతకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు ప్రేమికులు. ఈ అందమైన రోజున ప్రేమికులు ఏకాంతం సమయంలో గడపాలని ఎన్నో ఊసులను చెప్పుకోవాలనీ, అంతులేని ప్రేమను తెలియజేయాలని ముచ్చటపడుతుంటారు. అంతేకాదు ఈ రోజు కోసం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటుంటారు. కానీ కొంత మంది యువత ఇప్పటికీ కూడా సింగిల్ గా ఉన్న వాళ్లు ఉన్నారు. వారు వాళ్ల సింగిల్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఏదో ఒక మూలన వాలెంటైన్ రోజు మేము ఇంకా సింగిల్ గానే ఉన్నామే తెగ బాధపడిపోతుంటారు. అలాంటి వారు ఈ రోజున కొన్ని సింపుల్ చిట్కాలతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవచ్చు. అందుకు మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీకోసం ఓ గిఫ్ట్: ఎన్నాళ్ల నుంచో మీరు ఏదైనా వస్తువును కొనాలనుకుంటూ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారా? అయితే  వాలెంటైన రోజున మీకు మీరు ఒక గిఫ్ట్ ను ప్రజెంట్ చేసుకోండి. ప్రేమికుల రోజున ఒంటిరిగా ఉన్నామనే ఫీలింగ్ ను ఇది తరిమేస్తుంది తెలుసా. అంతేకాదు ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటేనే కదా.. మీ లైఫ్ లోకి వచ్చేవారిని అంతకంటే ఎక్కువగా ప్రేమించేది. సో ఈ రోజున బయటకు వెళ్లి మీకోసం ఒక అందమైన గిఫ్ట్ ను కొనేసేయండి.
 

Latest Videos


మీపై దృష్టి పెట్టండి:  ఈ గజిబిజీ లైఫ్ లో ఏ ఒక్కరు కూడా తమకోసం తాము కాస్త సమయాన్ని కూడా కేటాయించుకోలేకపోతున్నారు. లైఫ్ ఇలాగే కొనసాగితే.. మీ లైఫ్ లో ఆనందం మటుమాయమవుతుంది. అందుకే ఈ ఫిబ్రవరి 14 న సమ్ థింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునేలా ఏదైనా చేసేయండి. నచ్చిన ఫుడ్ ను తినడమో లేక సినిమాకు వెళ్లడమో లేకపోతే ఇష్టమైన ప్లేసెస్ కు వెళ్లడం, షికార్లకు వెళ్లడం.. లాంటివి ఎన్నో విషయాలున్నాయి. ఈ రోజున మీకు నచ్చిన పనులను చేయడం వల్ల ఈ డే ఎంతో సంతోషంగా అంతకు మించి ప్రశాంతంగా గడుస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.

డేట్: ఇద్దరు వ్యక్తులుంటేనే డేట్ కు వెళ్లగలం అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. డేటింగ్ కు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ రూలేమీ లేదు కదా.. ? అందుకే ఈ వాలెంటైన్ రోజును ఒక అందమైన డేట్ ను ఫిక్స్ చేసుకుని సారదాగా గడపండి. అందంగా రెడీ అయ్యి మీ మనసుకు నచ్చిన పనిచేయడంలో వచ్చే ఆ కిక్కే వేరబ్బా..

పార్టీ: ఈ ప్రేమికుల రోజు మీకు ఎప్పటికీ గుర్తుండి పోవాలంటే మీ స్నేహితులతో ఈ రోజు పార్టీ చేసుకోండి. ఈ రోజు మీ ఫ్రెండ్స్ తో కలిసి మంచి విహారయాత్రకు వెళ్లినా సంతోషంగా ఉంటారు. అలా కుదరదనుకుంటే ఇంట్లోనే మీ స్నేహితులతో పార్టీ చేసుకోవచ్చు. అందరితో కలిసి ఆనందంగా ముచ్చట్లు పెడితే మీరు ఒంటరి వాళ్లు అనే ఫీలింగ్ కలగదు. మీకిష్టమైన వారితో ఈ రోజును గడిపితే మీ మనస్సు హాయిగా ఉంటుంది. 

మీ ప్రతిభను బయటపెట్టండి: చాలా మందిలో ఎన్నో రకాల ప్రతిభలుదాగుంటాయి.  కానీ వాటిని అస్సలు బయటపెట్టరు. కొంతమందికి పాటలు పాడటమంటే చాలా ఇష్టం ఉంటుంది. అలా అని వాళ్లు అందరిముందు పాడటానికి మొహమాటపడుతుంటారు. అలాంటి వారు వాళ్ల సింగింగ్ ప్రతిభను కేవలం బాత్రూంలోనే ప్రదర్శిస్తుంటారు. అందుకే వీళ్లను బాత్రూం సింగర్లని పిలిచేది. ఇకపోతే ఈ రోజు మీలో దాగున్న అసలైన ప్రతిభను బయటకు తీయండి. పాటలు పాడాలనుంటే పాటలను, డాన్స్ చేయడానుకుంటే డాన్స్ చేసి రికార్డు చేయండి. ఈ పనులు కూడా మీకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి.  
 

click me!