
ఖాళీ కడుపుతో ఏయే ఆహారాలను తినకూడదో చాలా మందికే తెలిసి ఉంటుంది. అలాగే ఉదయం లేవగానే పరిగడుపున తినాల్సిన ఆహారాలేంటో కూడా తెల్సి ఉండాలి. ఎందుకంటే అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో రోగాలను సైతం తరిమి కొడతాయి. ముఖ్యంగా ఉదయం లేవగానే నీళ్లు తాగడం లేదా నీళ్లు తేనె, పండ్ల రసం మొదలైనవి తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వీటన్నింటి కంటే ఉత్తమమైనది ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యిని తీసుకోవడం. ఇది కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని మనందరికీ తెలుసు. నెయ్యి చర్మ సంరక్షణకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. నెయ్యి ఎముకలను బలపరుస్తుంది. అందుకే దీనిని తరచుగా పిల్లలకు, వృద్ధులకు ఇస్తుంటారు. ఈ కారణంగానే రోజుకు కనీసం ఒక చెంచా నెయ్యి తాగాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు.
డైటీషియన్ భక్తి కపూర్ ప్రకారం.. ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే మొదటి ఆరు ప్రయోజనాలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
నెయ్యి చిన్న ప్రేగుల శోషణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణశయాంతర వ్యవస్థ యొక్క ఆమ్ల పిహెచ్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాదు ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నసహజ వనరు కూడా. ఇది డిఎన్ఎను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఆక్సీకరణ లేదా ఆక్సీకరణ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇది శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల శరీర నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యిలో ఉండే మూలకాలు కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. ఇది అంతర్గత నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఉదయాన్నే నెయ్యిని తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యి కొవ్వును కరిగిస్తుంది. పేగు సమస్యలతో బాధపడుతుంటే ఉదయాన్నే నెయ్యి తినడం వల్ల సమస్య పరిష్కారమవుతుంది.
ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
చర్మ ఆరోగ్యానికి నెయ్యి మేలు చేస్తుంది.
ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాదు.. కడుపులోని విష పదార్థాలను తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా పొట్టను శుద్ధి చేస్తుంది.
నెయ్యి ఫిల్లర్ గా పని చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. దీంతో మీరు ఓవర్ గా తీసుకోలేరు.
నెయ్యి ఎముకలను బలంగా తయారుచేస్తుంది. అలాగే శరీరానికి బలాన్ని ఇస్తుంది.
మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా నెయ్యి దివ్య ఔషదంలా పనిచేస్తుంది.
నెయ్యిని తీసుకోవడం వల్ల మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది ఏకాగ్రతను పెంచుతుంది.