Causes of weight Gain: బరువు పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అలాంటి పరిస్థితిలో మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది.
ఈ రోజుల్లో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. ఇవి చాలా చిన్న సమస్యలుగా కనిపించినా ప్రమాదకరమైన సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విపరీంగా బరువు పెరగడానికి అసలు కారణం మీ జీవన శైలి. అవును.. అతీ.. గతి తప్పిన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒకే దగ్గర గంటల తరబడి కూర్చోవడం వంటి కారణాల వల్ల ఊబయానికి దారితీస్తుంది.
27
ఇవే కాకుండా బరువు పెరగడానికి కారణమయ్యే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఏయే కారణాల వల్ల బరువు పెరుగుతారో తెలుసుకుందాం పదండి.
37
థైరాయిడ్.. ఒక వేళ మీకు థైరాయిడ్ ఉండే కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ థైరాయిడ్ వల్ల జీవక్రియ బలహీనపడుతుంది. దీంతోనే మీ శరీరం బరువు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో సరైన చికిత్స తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు.
47
డయాబెటీస్.. డయాబెటీస్ సమస్య ఉంటే కూడా విపరీతంగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వీరు సకాలంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
57
ఒత్తిడి.. మారుతున్న జీవనశైలిలో ప్రజలపై ఒత్తిడి ప్రభావం ఎక్కువైంది. కానీ ఈ ఒత్తిడి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందులో బరువు పెరగడం ఒకటి. ఒత్తిడి కారణంగా కూడా బరువు పెరుగుతారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేల ఒక 10 నిమిషాల పాటు యోగాను లేదా వ్యాయామం చేయొచ్చు.
67
జీవక్రియ చెడుగా ఉంటే కూడా.. జీవక్రియ సరిగ్గా లేకపోయినా కూడా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే జీవక్రియను బలోపేతం చేయడానికి తాజా పండ్లను, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
77
ఆయిల్ ఫుడ్స్.. ఆయిల్ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల సర్వరోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శరీర బరువు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి.