ఈ రోజులో అధిక రక్తపోటు, బీపీ కంట్రోల్ లో లేకపోవడం( తగ్గడం లేదా పెరగడం) సర్వ సాధారణంగా మారిపోయింది. వాస్తవానికి మారుతున్న జీవనశైలి, పేలవమైన ఆహారం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్య బారిన పడతారు. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ బీపీని కంట్రోల్ లో ఉంచడానికి కొన్ని రకాల పండ్లు ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..
26
కివీ.. అధిక రక్తపోటును నియంత్రించడానికి కివీ ఎంతో సహాయపడుతుంది. దీన్ని మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం దూరంగా ఉంచుతుంది. ఈ పండును వారానికి ఒక సారి తిన్నా మీ ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవే బీపీని నియంత్రణలో ఉంచుతాయి. దీన్ని జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది.
36
అరటి పండ్లు.. అరటి పండ్లు కూడా బీపీని నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. బీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో వీటిని చేర్చుకుంటే మంచిది. ఈ పండులో పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఈ పండు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా.
46
పెరుగు.. పెరుగు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనిలో అధిక రక్తపోటును నియంత్రించే లక్షణాలున్నాయి. పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లేవిన్, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ బీపీని కంట్రోల్ లో ఉంచుతాయి.
56
చిలగడదుంప.. చిలగడదుంపలో బీపీని నియంత్రించే గుణాలుంటాయి. ఇందులో బీటా కెరోటిన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
66
స్ట్రాబెర్రీలు.. స్ట్రాబెర్రీలు కూడా బీపీని నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి.