ఎండాకాలంలో చర్మానికి కలబందను పెడితే?

First Published May 18, 2023, 12:21 PM IST

ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. చర్మ రంగు కూడా మారుతుంది. అయితే ఈ సీజన్ లో చర్మానికి కలబందను పెడితే ఈ సమస్యలే ఉండవంటున్నారు నిపుణులు. 
 

కలబంద మన చర్మానికి, జుట్టుకు, మన మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. కలబంద జెల్ కూడా చర్మానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కలబంద ఆకులు చాలా మందంగా ఉంటాయి. దీని రసం జెల్ రూపంలో ఉంటుంది. దీనిని కలబంద జెల్ అంటారు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే ఈ జెల్ ను ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. 
 

aloe vera gel

కలబంద జెల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. కలబంద జెల్ వడదెబ్బ, చికాకు, కాలిన చర్మ గాయాలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. సమ్మర్ సీజన్ లో దీన్ని మీ చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద మీ చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. వేసవి నెలల్లో మీ చర్మం సూర్యరశ్మి, గాలి, స్విమ్మింగ్ పూల్స్ నుంచి క్లోరిన్ కు గురవుతుంది. ఇవన్నీ చర్మం పొడిబారేలా చేస్తాయి. కలబందలో ఎక్కువ మొత్తంలో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమగా చేయడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా ఉంచేటప్పుడు తేమను నిలుపుకోవటానికి సహాయపడే సహజ నూనెలను కూడా కలిగి ఉంటుంది.


అలోవెరా స్కిన్ ఎక్స్ఫోలియేటర్ 

కాలుష్యం, దుమ్ము ధూళి కారణంగా మన ముఖంపై మురికి పేరుకుపోతుంది. దీనివల్ల ముఖం సహజ మెరుపు పోతుంది. ఈ మెరుపును తిరిగి తీసుకురావడానికి ఎక్స్ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. రీసెర్చ్ గేట్ లో ప్రచురించిన ఒక జర్నల్ ప్రకారం.. కలబందను ఎక్స్ఫోలియేటర్ గా ఉపయోగించొచ్చు. కలబందతో స్క్రబ్ చేయడం వల్ల ముఖం లేదా చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇది ముఖాన్ని మెరుగుపరుస్తుంది. ముఖాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల మీ ముఖం పై మురికి, మచ్చలు తొలగిపోతాయి. 
 

Image: Getty Images


కొల్లాజెన్ బూస్టర్ కలబంద 

చర్మాన్నియవ్వనంగా ఉంచడానికి, చర్మంలో స్థితిస్థాపకతను ఉంచడానికి మీ చర్మంలో కొల్లాజెన్ అవసరం. చర్మంలో స్థితిస్థాపకత, తేమను నిర్వహించడానికి కొల్లాజెన్ పనిచేస్తుంది. కలబందలో స్టెరాల్స్ ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ ను పెంచడానికి సహాయపడతాయి. చర్మంలో కొల్లాజెన్ ను పెంచడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గిపోతాయి. ఇది ముడతలను, సన్నని గీతలను తగ్గిస్తుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కలబందను వాడాలని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. కావాలనుకుంటే కలబంద ఉన్న క్రీమ్ ను కూడా వాడొచ్చు.
 


అలోవెరా మాయిశ్చరైజర్

చర్మాన్ని నీట్ గా చేయడానికి, హైడ్రేట్ గా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ చాలా ముఖ్యం. మీ చర్మంలో తేమను ఉంచడానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ పనిచేస్తుంది. మీరు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయకపోతే మీ చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. 

కలబందలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మంలోని మాయిశ్చరైజర్ ను లాక్ చేస్తుంది. కలబందలో మ్యూకోపోలిసాకరైడ్లు ఉంటాయి. ఇవి చర్మంలో తేమను పుట్టిస్తాయి. కలబంద చర్మంలో తేమను పెంచుతుంది. పొడి చర్మం ఉన్నవారికి కలబంద ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

aloe vera gel

అలోవెరా కూలింగ్ మాస్క్ 

కలబందలో మీ చర్మాన్ని చల్లబరిచే లక్షణాలు ఉంటాయి. ఎండాకాలంలో కలబంద జెల్ ను ఉపయోగించడం వల్ల మీ చర్మం చల్లగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వడదెబ్బ, చర్మపు చికాకును తగ్గిస్తాయి. కలబందను చర్మానికి అప్లై చేసి ఎండలో బయటకు వస్తే ముఖంపై తేమను ఉంచే రక్షణ పొర మన చర్మాన్ని రక్షిస్తుంది. ఇది పిగ్మెంటేషన్, వడదెబ్బ వంటి సమస్యలను కలిగించదు.
 

కలబందలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని నయం చేయడానికి సహాయపడతాయి. ఎండాకాలంలో చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచడానికి కలబందను ఉపయోగించడం గొప్ప మార్గం.

click me!