ఎండాకాలంలో టైట్ జీన్స్ వేసుకుంటే..?

First Published May 18, 2023, 11:42 AM IST

అన్ని సీజన్లకు ఒకేరకమైన బట్టలను వేసుకోకూడదు. ఏ సీజన్ కు దగ్గట్టు.. అలాంటి బట్టలు వేసుకోవాలి. వానాకాలం, చలికాలంలో టైట్ బట్టలను వేసుకోవచ్చు. కానీ ఎండాకాలంలో ఇలాంటి బట్టలను అస్సలు వేసుకోకూడదు. వేసుకున్నారో..! 
 

స్టైలీష్ గా ఉండానికి ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు సమ్మర్ లో కూడా టైట్ బట్టలను వేసుకుంటారు. ముఖ్యంగా టైట్ జీన్స్. నిజానికి ఎండాకాలంలో జీన్స్ కు బదులుగా లూజ్ ప్యాంట్  ను వేసుకుంటేనే కంఫర్ట్ గా ఉంటుంది. మండే ఎండలు, వేడి మీ మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. టైట్ జీన్స్ ను వేసుకోవడం వల్ల మీ చర్మం శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 
 

మీరు చేసిన ఈ పొరపాటు మీ కాళ్లు, నడుమును మాత్రమే కాదు మీ సన్నిహిత ప్రాంతాన్ని కూడా బాగా దెబ్బతీస్తుంది. అందుకే ఎండాకాలంలో జీన్స్ కంటే ఇతన లూజ్ ప్యాంట్లను వేసుకోవాలి. అసలు ఎండాకాలంలో టైట్ జీన్స్ ను వేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Jeans Ban

యోని గడ్డలు 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టైట్ జీన్స్ ను వేసుకోవడం వల్ల సన్నిహిత ప్రాంతం బిగుతుగా ఉంటుంది. అలాగే అక్కడ ఎక్కువ ఘర్షణగా ఉంటుంది. ఇలాంటి టైట్ జీన్స్ ను వేసుకోవడం ఎండాకాలంలో అక్కడ చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే జీన్స్ క్లాత్ చాలా మందంగా ఉంటుంది, పైగా టైట్ జీన్స్ ను వేసుకున్నప్పుడు  యోని చర్మంపై చెమట ఉంటుంది. దీని వల్ల బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. ఇదీ కాకుండా యోనిలోకి గాలి వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీని వల్ల గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది.
 

జాక్ ఇచ్ సమస్య

ఎక్కువసేపు టైట్ జీన్స్ ను వేసుకోవడం వల్ల జాక్ దురద వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది తొడలు. జననేంద్రియాల మధ్య వచ్చే ఒక రకమైన సంక్రమణ. ఈ సమస్య వల్ల దురద ఎక్కువగా పెడుతుంది.  మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి ఈ సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఎండాకాంలో టైట్ జీన్స్ ను వేసుకుంటే ఈ రిస్క్ పెరుగుతుంది.

అలాగే ఎండాకాలంలో చెమట కారణంగా జాక్ ఇన్ఫెక్షన్ చికాకు, నొప్పిని కలిగిస్తుంది.  అలాగే దురదను కూడా పెంచుతుంది. దీని వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా వరకు వ్యాపిస్తుంది. అధిక బరువు ఉంటే లేదా మీకు ఎక్కువ చెమట పట్టినట్టైతే ఈ ప్రమాదం పెరుగుతుంది.
 

Jeans

యోని ఇన్ఫెక్షన్లు, దురద

టైట్ జీన్స్ ను ఎక్కువసేపు వేసుకోవడం వల్ల మీ సన్నిహిత ప్రాంతానికి గాలి చేరదు. ఎండాకాలంలో చెమటలు ఎక్కువగా పట్టడం, గాలి లేకపోవడం, చెమట ఎండిపోకపోవడం వల్ల యోని బ్యాక్టీరియా, ఫంగస్ కు నిలయంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సంక్రమణకు కారణమవుతుంది. మరోవైపు టైట్ జీన్స్ ను వేసుకోవడం వల్ల శరీర వేడి పెరుగుతుంది. ఇది చికాకును కలిగిస్తుంది.
 

వల్వోడినియాతో సమస్య 

జర్నల్ ఆఫ్ జననేంద్రియ ట్రాక్ డిసీజ్ లో పరిశోధన.. టైట్-ఫిట్టింగ్ జీన్స్ లేదా సన్నని ప్యాంట్ ధరించడం వల్వోడినియాకు కారణమవుతుందని కనుగొన్నారు. వాస్తవానికి వల్వోడినియా అనేది వల్వాలో అసౌకర్యం, నొప్పిని కలిగించే పరిస్థితి. టైట్ జీన్స్ వల్వర్ ప్రాంతం చుట్టూ ఉన్న సిర గాయం, చికాకును కలిగిస్తుంది. అందులోనూ మీ చర్మం సున్నితంగా ఉంటే బిగుతైన దుస్తులు ధరించడం వల్ల వల్వోడినియా సమస్య వస్తుంది. 

పాదాలపై వేడి దద్దుర్లు

వేడి వాతావరణంలో వేడి దద్దుర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మన శరీరంలోని ఏ భాగంలోనైనా చెమట పట్టొచ్చు. ఎండాకాలంలో టైట్ జీన్స్ వేసుకుంటే పాదాల్లో ఎక్కువ చెమట పడుతుంది. ఇది పూర్తిగా ఎండిపోకపోవడం వల్ల పాదాలు, తొడలు, వంపులపై గౌట్ ఏర్పడుతుంది.
 

తుంటి 

జర్నల్ ఆఫ్ న్యూరాలజీ న్యూరో సర్జరీ నుంచి వచ్చిన పరిశోధన ప్రకారం.. ఎక్కువసేపు టైట్ జీన్స్ ధరించడం వల్ల హిప్ జాయింట్ వెన్నెముకపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన ఎముకల కోసం వదులుగా ఉండే దుస్తులను వేసుకోండి. 

click me!