చిట్టి చిట్టి ఈ ఆకుల్లో ఇన్ని ప్రోటీన్స్ ఉన్నాయా? శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోతున్నారు

First Published | Nov 8, 2024, 12:30 PM IST

పాలకూర కంటే 25 రెట్లు ఎక్కువగా ఐరన్ ఉండే ఆకు కూర ఇది. ఇందులో పెరుగు కంటే 9 రెట్లు ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. పాలలో కంటే 17 రెట్లు ఎక్కువగా కాలిష్యం ఈ ఆకు కూరలో ఉంటుంది. క్యారెట్లో కంటే 10 రెట్లు అధికంగా విటమిన్ ఏ ఉండే సూపర్ నేచురల్ ఆకు కూర ఇది. అంతే కాకుండా ఆరెంజ్ ఫ్రూట్స్ లో కంటే 7 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఇందులో ఉంటుంది. అరటి పండ్లలో కంటే 15 రెట్లు ఎక్కువగా పొటాషియం ఉండే అద్భుతమైన ఆకుకూర మనకు తరచూ కనిపిస్తుంది. అయితే ఇందులో ఇన్ని హైన్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఈ సూపర్ ఫుడ్ ఐటమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. 
 

ఐరన్, పొటాషియం, ప్రోటీన్స్, విటమిన్ ఏ, సీ, .. ఇలా  ఎన్నో రకాల పోషకాలు ఒక ఆకు కూరలోనే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఈ చెట్టు కాయలను మాత్రమే మనం రెగ్యులర్ గా కూరల్లో ఉపయోగిస్తాం. అయితే ఆ చెట్టు చిట్టి ఆకుల్లో ఇన్ని పోషకాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అందుకే కేవలం వాటి కాయలను మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ కాయలు వాడకపోతే కూరల్లో టేస్టే రాదు. అలాంటి అద్భుతమైన చెట్టు మునగ చెట్టు. హై న్యూటిషనల్ వాల్యూస్ ఉన్న ఆకులే మునగాకు. ఈ చెట్టు, ఆకులను పరిశోధించిన శాస్ర్తవేత్తలు వాటి న్యూట్రిషన్ వాల్యూస్ తెలుసుకొని ఆశ్యర్యపోయారు. ఈ చెట్టును సూపర్ పవర్ చెట్టు అని పిలవడం ప్రారంభించారు.
 

మునగాకును చాలా తక్కువ మంది కూరగా ఉపయోగిస్తారు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఈ ఆకులను ఉపయోగిస్తారు. అయితే చిన్న చిన్న గా ఉండే ఈ మునగాకులో ఇన్ని షోషకాలు ఉన్నాయంటే నమ్మలేరు. మునగాకును నేరుగా తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 

మునగాకులో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇందులో 9 రకాల అమినో ఆసిడ్స్ ఉంటాయి. మునగాకును "సూపర్ ఫుడ్" అని, మునగ చెట్టును "అద్భుత  చెట్టు" అని పిలుస్తారు. ఈ చెట్టు ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఆకులు, పండ్లు, కాయలు, పువ్వులు, వేర్ల రసం, నూనె కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆకులు చాలా పవర్ ఫుల్ ప్రొటీన్ ను కలిగి ఉంటుంది. 
 


మునగ ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వ్యాధులను నివారించడానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. సాధారణంగా మునగ ఆకులను వేయించి ఇతర కూరగాయలతో కలిపి వంట చేస్తారు. దీని వల్ల పోషక విలువలు పెరుగుతాయి. 

విటమిన్లు, మినరల్స్: మునగ ఆకులు అనేక ముఖ్యమైన శరీర విధులు, ప్రక్రియలను నిర్వహించడానికి సహాయపడే విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. మునగ ఆకుల్లో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి1(థయామిన్), విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి3 (నియాసిన్) విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) ఉంటాయి. కాల్షియం, ఇనుము, జింక్, పొటాషియం, భాస్వరం కూడా సమపాళ్లలో ఉంటాయి. అన్ని రకాలు పోషకాలు ఇలా ఒకే ఆకు కూరలో ఉండటం చాలా అరుదు.  
 

అమైనో ఆమ్లాలు: మునగ ఆకుల్లో దాదాపు 18 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. శరీరంలో ఏభాగానికి శక్తి నివ్వాలన్నా మునగ ఆకులు సరిపోతాయి. 

యాంటీ ఆక్సిడెంట్లు: మునగ ఆకులు కూడా యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి పని చేస్తాయి. ఆక్సీకరణను నిరోధించడం ద్వారా ఒత్తిడి, నష్టం, మధుమేహం, గుండె జబ్బులు వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులను నివారించవచ్చు.

మునగాకు తినడం వల్ల ముఖ్యంగా 12 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టును ఆరోగ్యంగా కాపాడటానికి ఉపయోగపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. లివర్ వ్యాధులను నివారిస్తాయి.  నాడీ వ్యవస్థలో ఇబ్బందులను తగ్గిస్తాయి. మునగాకు సెరోటోనిన్, డోపమైన్, నోరాడ్రినలిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తిని కూడా పెంచుతాయి. దీని వల్ల మూడ్ బ్యాలెన్స్ చేసుకోవడం మీకు అలవాటు అవుతుంది. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మునగాకు ఆకులను తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. 

వీటిల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధించవచ్చు. కిడ్నీలో రాళ్లు కరిగించే శక్తి మునగాకుకు ఉంది. ఆస్తమా, ఇతర శ్వాసకోశ రుగ్మతలను తగ్గిస్తుంది. ఉబ్బసం, శ్వాసనాళ సంకోచాలను నిలువరిస్తుంది. మునగాకు తినడం వల్ల రక్త సంబంధిత వ్యాధులు ఆటోమెటిక్ గా తగ్గుతాయి. రక్త హీనత, సికిల్ సెల్ వ్యాధి నివారణలో మునగాకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. 

ఇన్ని హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న మునగాకును పొడిగానో, కూరల్లోనో ప్రతి రోజు కొంచెం ఉపయోగించడం వల్ల రోగాలు రాకుండా ఉండటంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటాయని డాక్టర్లు  చెబుతున్నారు. 

Latest Videos

click me!