My Life Partner: ఇలాంటి అబ్బాయిలను లవ్ చేయకపోవడమే మంచిదట..

First Published | Mar 22, 2022, 2:26 PM IST

లైఫ్ లాంగ్ మనతో ఉండే అబ్బాయి.. మన కష్టాల్లో తోడుండాలి. మన సంతోషాల్లో భాగమవ్వాలి. బాధలో ఉంటే ధైర్యాన్ని ఇవ్వాలి.  ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి ఎల్లవేళలా మనకు తోడూ నీడగా ఉండాలే తప్ప.. ఏమీ పట్టనట్టు, ఈమెకు నాకు ఏ సంబంధం లేదన్నట్టు ప్రవర్తించకూడదు. 
 


ప్రతి ఒక్క మహిళ తన జీవితంలోకి వచ్చే అబ్బాయికి కొన్నిక్వాలిటీస్ పక్కాగా ఉండాలనుకుంటుంది. ప్రేమగా చూసుకుంటూ.. ఆమె ప్రతి మూమెంట్ లో తన భర్త ఉండాలని, వారిద్దరూ ఎప్పుడూ ఓపెన్ గా ఉండాలని భావిస్తారు. ఆమె సంతోషంలో భాగమవ్వాలని, ఆమె కష్టంలో తోడుగా ఉండాలని, బాధలో ధైర్యాన్ని ఇవ్వాలని , ప్రతి మూమెంట్ ను వారిద్దరూ కలిసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. భాగస్వామైనా సరే వారిని పట్టించుకోకపోవడం, సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదంటున్నారు నిపుణులు. కొన్ని లక్షణాలున్న అబ్బాయిలను లవ్ చేయకపోవడమే మంచిదంటున్నారు. ఇంతకీ ఎలాంటి లక్షణాలున్న అబ్బాయిలను లవ్ చేయకూడదో తెలుసుకుందాం పదండి.. 

ఇవి కీలకం: ఏ బంధమైనా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందులో నమ్మకం, గుర్తింపు, నిజాయితీ, గౌరవం వంటివి ప్రతి మనిషి ఎదుటి వ్యక్తి నుంచి ఆశిస్తారు. కాని కొంతమంది అబ్బాయిల్లో ఇవి మత్రం చూద్దామన్నా కనిపించవు. ఒక బంధాన్ని బలంగా చేసేందుకు ఇవే ఉపయోగపడతాయి. ఇలాంటి అబ్బాయిలు తమ లవర్ తో ఉన్నప్పుడు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంటారు. మీరెంత ఇంపార్టెంట్ అయినా వారి పర్సనల్ విషయాలను మాత్రం అస్సలు సేర్ చేసుకోరు. మీకు తనకు సంబంధం లేనట్టుగానే ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి అబ్బాయిలకు ఎంత దూరంగా ఉంటే అంతం మంచిదట. 


తప్పించుకునేతత్వం: జీవిత భాగస్వామిగా అనుకున్న వ్యక్తికి ఎలాంటి విషయాన్నైనా చెప్తారు. వీరి మధ్యలో దాపరికాలు, అబద్దాలు, వంటివి ఉండవు. ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటారు. ఏదైనా అవసరం అయితే సాయం చేయడానికి అస్సలు వెనకాడరు. అయితే మీ బాయ్ ఫ్రెండ్ మీతో ఫ్రీగా లేకుంటే మీరు ఆ బంధానికి స్వస్తి చెప్పాల్సిందే. మీతో ఏ విషయాలను కూడా షేర్ చేసుకోని వ్యక్తితో మీరు ఎక్కువ కాలం మీ రిలేషన్ షిప్ ను కొనసాగించలేరని అర్థం చేసుకోవాలి. 

సీక్రెట్స్ మెయిన్ టైన్ చేస్తే.. రిలేషన్ షిప్ లో సీక్రేట్స్ కు తావుండవు. చిన్న చిన్న విషయాల నుంచి ఎంతచెప్పకూడని విషయమైనా చెప్పేస్తుంటారు. మనతో జీవితాన్ని షేర్ చేసుకునే వ్యక్తులు సీక్రేట్స్ మెయిన్ టైన్ చేయడం అంత మంచి విషయమైతే కాదు. జీవిత భాగస్వామి కష్ట సుఖాలను తెలుసుకునే రైట్ మీకు ఉంటుంది. ఒకవేల మీరు అడిగినా.. అతను చెప్పకుంటే తనతో బ్రేకప్ అవ్వడమే బెటర్. 

నాట్ రీచబుల్:  లవ్ లో ఉన్నవారికి రోజుకు 24 గంటలు కూడా సరిపోవంటుంటారు. ఎప్పుడు చూసినా.. తన ప్రియురాలితోనే మాట్లాడుతుంటారు. అయితే కొంతమంది అబ్బాయిలు తమ లవర్ తో మాట్లాడాలనుకోరు. అమ్మాయిలు అతనికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా అందుబాటులో లేదు, నాట్ రీచబుల్ అని నిరంతరం వస్తే మాత్రం .. వారికి బ్రేకప్ చెప్పడమే బెటర్. కొన్ని సార్లు ఫోన్ కలిసినా.. లిఫ్ట్ చేయరు. మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వరు. ఒక గెస్ట్ రోల్ లా ప్రవర్తించే వ్యక్తులు మీకెప్పుడూ సరిపోరు. వారు మిమ్మల్ని గౌరవించనప్పుడే ఇలా ప్రవర్తిస్తుంటారు.

సీరియస్ గా ఉన్నప్పుడు జోకులేసే వ్యక్తి..  లైఫ్ ను పంచుకునే వ్యక్తి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలని అమ్మాయిలు భావిస్తుంటారు. కానీ కొంతమంది అబ్బాయిలు బాధలున్నా చెప్పుకోకుండా భావోద్వేగాలను దాచేస్తుంటారు. అంతేకాదు ఇద్దరూ సీరియస్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో జోకులు వేస్తుంటారు. ఇలాంటి వారు మీకు గౌరవం ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి. 
 

పదే పదే అడిగినా.. వారికి సంబంధించిన విషయాలను మీరు ఎంతలా అడిగినా సరే కొంతమంది అబ్బాయిలు అస్సలు నోరు విప్పరు. ఆ విషయాలను చెప్పరు. మీరేమీ చెప్పనట్టు, వారేమీ విననట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇటువంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. ఇలాంటి వారితో జీవితం పంచుకుంటే లైఫ్ లో మీరు ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు.     

Latest Videos

click me!