Summer Health Tips: ఎండలకు కూల్ డ్రింక్స్ ను తాగడం ఎంత డేంజరో తెలుసా..?

Published : Apr 18, 2022, 12:03 PM IST

Summer Health Tips: దంచికొడుతున్న ఎండలు ఒకవైపు.. ఉబ్బరం, వేడి తాపం ఇంకోవైపు. ఇంకేముంది వేసవితాపాన్ని తీర్చుకునేందుకు చాలా మంది కూల్ డ్రిక్స్ నే ఆశ్రయిస్తుంటారు. కానీ  కూల్ డ్రింక్స్ తాగడం ఎంత ప్రమాదమో తెలుసా.. 

PREV
18
Summer Health Tips: ఎండలకు కూల్ డ్రింక్స్ ను తాగడం ఎంత డేంజరో తెలుసా..?

ఎండాకాలం మొదలై.. ఎండలు తీవ్రస్థాయిలో దంచికొడుతున్నాయి. ఇంకేముంది జనాలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇక వేసవి తాపం, ఉక్కపోతలను తట్టుకునేందుకు పనుల మీద బయటకు వెళ్లిన వారే కాదు ఇంట్లో ఉండేవారు సైతం కూల్ డింక్స్ ను తాగడానికి ఇష్టపడుతున్నారు. 
 

28

చల్లచల్లగా ఉండే ఈ పానీయాలు శరీరాన్ని కూల్ గా చేస్తాయని వీటిని ఇష్టంగా తాగుతుంటారు. ఇవి రుచిలో కూడా దిబెస్ట్ అనిపించుకుంటాయి కూడా. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. 

38

ఈ కూల్ డ్రింక్స్ ను చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్లు సైతం ఇష్టంగా తాగుతుంటారు. ఇక ఈ సీజనల్ లో అయితే వీటి వాడకం విపరీతంగా ఉంటుంది. చల్లగా, రుచిగా ఉండే ఈ పానీయాలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

48

ఈ శీతల పానీయాలను తాగితే మీ శరీరంలో రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయట. దాంతో మీరు ఎన్నో సమస్యల బారిన పడొచ్చు. మరి ఈ శీతల పానీయాలను తాగడం వల్ల ఎలాంటి హానీ కలుగుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

58

బరువు పెరుగుతారు.. కూల్ డ్రింక్స్ ను మోతాదుకు మించి తాగడం వల్ల విపరీతంగా బరువు పెరిగే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. షుగర్ మన శరీర బరువును పెంచడమే కాదు ఎన్నో రోగాల బారిన పడేలా చేస్తుంది. గ్లాస్ కూల్ డ్రింక్ లో సుమారుగా 8 టీ స్పూన్ల కంటే షుగర్ ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే మీరు ఒక గ్లాస్ కూల్ డ్రింక్ ను తాగితే 150 కేలరీలు మీ శరీరంలోకి వెళ్లిపోతాయి. ప్రతిరోజూ వీటిని గనుక తాగితే.. కొన్నిరోజుల్లోనే విపరీతంగా బరువు పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా మీరు ఎన్నో రోగాల బారిన పడొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

68

ఫ్యాటీ లివర్ సమస్యలు.. కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే  గ్లూకోజ్ , ఫ్రక్టోజ్ లో .. గ్లూకోజ్ అనే చక్కెరను శరీరం తొందరగా గ్రహించినా.. ఫ్రక్టోజ్ మాత్రం కాలెయంలో స్టోర్ అయ్యి ఉంటుంది. కాలెయంలో ఫ్రక్టోజ్ నిల్వలు ఎక్కువైతే మాత్రం కాలెయంపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో లివర్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

78

డయాబెటీస్ సమస్యలు.. కూల్ డ్రింక్స్ ను ఎక్కువగా తాగడం వల్ల డయాబెటీస్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ శీతల పానీయాల్లో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో ఇన్సులిన్ హార్మోన్ పై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. 

88

దంతాలపై చెడు ప్రభావం.. ఇది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమైనా.. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల దంతాలపై చెడు ప్రభావం పడుతుంది. వీటిలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ దంతాలకు హానీ చేస్తుంది. వీటిలో ఉండే ఇతర యాసిడ్లు దంతాల ఆరోగ్యాన్ని చెడగొడతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories