
Food: దక్షిణాదిన అన్నాన్ని తీసుకున్నంతగా ఇతర ఏ ఆహారాలను తీసుకోరు. అందుకే ఇక్కడ వరి ధాన్యాన్ని ఎక్కువగా పండిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అంటూ మూడుపూటల కూడా అన్నాన్నే తీసుకుంటారు. ఇక ఈ అన్నంలో కూరలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. నిజానికి అన్నం కంటే కూరల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్నం తక్కువ తీసుకుని కూరలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అంటే ఒక రెండు కప్పుల అన్నంలో ఒక కప్పు కూరలను కలుపుకుని తినాలి. ఇలా తింటేనే మీరు ఆరోగ్యంగా , చురుగ్గా ఉంటారు. అలాగే వెయిట్ పెరిగే అవకాశం కూడా ఉండదు. కూరల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. అదే అన్నంలో అయితే కేవలం కార్బోహైడ్రేట్లే ఉంటాయి. వీటివల్ల మన ఆరోగ్యానికి పెద్దగా వచ్చే లాభమేమీ ఉండదు.
ఒకప్పుడు మన పెద్దలు అన్నంలో కూరలను ఎక్కువగా కలుపుకుని తినేవారు. అందుకే వారు ఆరోగ్యంగా ఉంటూ వందేళ్లు బతికారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్నంలో కూరలను ఎక్కువగా తినాలని సూచిస్తోంది. 400 గ్రాముల కూరగాయలు మీ రోజు వారి ఆహారంలో ఉండేట్టు చూసుకోలని సూచిస్తోంది. అలాగే రకరకాల పండ్లను సైతం తీసుకుంటూ ఉండాలి. కూరగాయల్లో ఆకు కూరలు, దుంపలు, ఇతర కాయగూరలు ఉండేట్టు ప్లాన్ చేసుకోవాలి. దీనిప్రకారం.. మీరు రోజుకు అరకిలో కూరలు తింటే మిగతాది పండ్లు, పాల ఉత్పత్తులు, అన్నం వంటి వాటిని తీసుకోవాలి.
ఇక మీరు తినేటప్పుడు మీ ప్లేట్ పూర్తిగా నిండిపోవాలి. రకరకాల కూరలు, అన్నం, పెరుగు వంటి వాటితో పూర్తిగా నిండిపోవాలి. ఇక పోతే పాల ఉత్పత్తుల్లో వెన్న లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వెన్న ఉంటే బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మీరు ఓవర్ గా బరువు పెరిగే అవకాశమే లేదు.
ప్రస్తుత కాలంలో బిర్యానీలకు, చపాతీలకు, అన్నాన్ని తిన్నట్టుగా కూరలను మాత్రం తినడం లేదు. జస్ట్ టేస్ట్ గానే వీటిని చూస్తున్నారు. నిజానికి అన్నంలో పోషకాలు ఉండవు. కేవలం కార్బోహైడ్రేట్లే ఉంటాయి. పోషకలేమి సమస్యలు తలెత్తకూడదంటే కీరదోస కాయ, క్యారెట్లె, బీట్ రూట్ లను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని పచ్చిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
కూరగాయలను ఫ్రైలు చేసుకుని తినడం మానేయాలి. కూరల్లో వాటర్ పోసి వండుకుని తిన్నప్పుడే మన శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
ముఖ్కంగా సీజనల్ పండ్లను తప్పనిసరిగా తినాల్సి ఉండాలి. పండ్లను ఎక్కువగా తిన్నప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
కూరగాయలను, పప్పులను ఉడకబెట్టిన నీళ్లను బయటపోయడం వల్ల వాటిలో ఉండే పోషకాలన్నీ నీళ్లతో పాటుగా బయటకు పోతాయి. కాబట్టి వీటిని కూరల్లోనే పోయండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రోగాలు సోకకుండా మనల్ని కాపాడుతాయి.
మాంసాహారం చికెన్, మటన్ వంటి ఆహారాలను ఎక్కువగా తినకపోవడమే మంచిది. వీటిని రెగ్యులర్ గా తింటే లేని పోని సమస్యలు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.