Ugadi 2022: ఉగాది పచ్చడి విశిష్టత.. ఈ షడ్రుచులు దేనికి సంకేతమో తెలుసా..

First Published | Mar 25, 2022, 4:18 PM IST

Ugadi 2022: ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేసి.. షడ్రుచుల సమ్మేళనం.. రుచికరమైన ఉగాది పచ్చడి పచ్చడి.. ఈ పచ్చడి కేవలం ఈ పండుగ స్పెషల్ వంటకమే కాదు.. మన జీవిత సారాంశం తెలిపే.. సూచికలు కూడా.. మరి ఇందులో వేసే ఒక్కో పదార్థం ఎలాంటి భావాన్ని సూచిస్తుందో తెలుసుకుందాం పదండి.. 
 

బెల్లం.. ఉగాది పచ్చడిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.  ఈ పచ్చడికి తియ్యదనాన్ని తీసుకొస్తుంది. పచ్చడిలో ఉపయోగించే కొత్తబెల్లం ఆనందానికి సంకేతంగా భావిస్తారు. ఈ కొత్తబెల్లం ఆకలి కలిగేలా చేస్తుంది. 

పులుపు.. పులుపును విసుగుకు సంకేతంగా భావిస్తారు. మన జీవితంలో ఎన్నో విషయాలు విసుగు పుట్టించేవిగా ఉంటాయి. వాటికి నేర్పుగా ప్రవర్థించాలని ఈ షడ్రుచుల్లోని పులుపు సూచిస్తుంది. 
 

Latest Videos


చింతపండు.. ఉగాది పచ్చడిలో చింతపండును కూడా ఉపయోగిస్తారు. ఈ చింతపండు కఫ వాతాన్ని తగ్గిస్తుంది. ఇక ఈ చింతపండు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా నేర్పుగా, ఓర్పుగా ప్రవర్తించాలని మనకు సూచిస్తుంది. 

కారం.. షడ్రుచుల్లో మూడో రుచి కారం.. ఈ రుచి పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు సహనం కోల్పోయిన దానికి గుర్తుగా నిలుస్తుంది. కారం మన శరీరంలో ఉండే  క్రిమికీటకాలను చంపేస్తుంది. 

ఉప్పు..  షడ్రుచుల్లో ఉప్పుది ముఖ్యమైన స్థానం.. ఈ ఉప్పును రుచికి సంకేతంగా భావిస్తారు. అంతేకాదు ఇది ఉత్సాహానికి, భయానికి సూచికలుగా కూడా చెబుతారు. 
 

చేదు.. ఉగాది పచ్చడిలో వేసే చేదు(వేప పూత) మన లైఫ్ లో వచ్చే బాధలకు, కలిగే దు:ఖాలకు సూచిక. వేపపువ్వును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఉగాది రోజున పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేసి.. పరిగడుపున పచ్చడిని తాగితే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పచ్చడిలో  షుడ్రుచులు ఉన్నట్టే.. మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను ఒకే విధంగా చూడాలని ఈ పచ్చడి మనకు సూచిస్తుంది. 

click me!