Indian Railway: చెత్త అమ్మి ఆరు నెలల్లో రూ.323 కోట్లు సంపాదించిన ఇండియన్ రైల్వే..!

Published : Oct 09, 2026, 09:28 AM IST

Indian Railway: పనికిరాని చెత్త వస్తువులను అమ్మేసి ఇండియన్ రైల్వే దాదాపు రూ.323 కోట్లు సంపాదించింది. రైల్వే యార్డులు, డిపోలు, వర్క్ షాపుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన పనికిరాని వస్తువులను వేలం వేసి సంపాదించడం విశేషం.

PREV
12
ఇండియన్ రైల్వే..

ఎందుకూ పనికిరాదు అనుకున్న పాత సామాను ఒక్కోసారి కోట్లకు పడగలెత్తుతుంది అనడానికి భారతీయ రైల్వే సరికొత్త ఉదాహరణగా నిలిచింది. రైల్వే యార్డులు, డిపోలు, వర్క్ షాపుల్లోనూ ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తా చెదారం, పనికిరాని వస్తువలను ఏరేయాలని రైల్వే శాఖ చేపట్టిన ‘జీరో స్క్రాప్ మిషన్’ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కేవలం పాత సామాన్లను వదలించుకోవడమే కాకుండా, దీని ద్వారా ఏకంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కేవలం ఆరునెలల్లో రూ.323 కోట్ల సంపాదన..

2026–27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 వరకు) సెంట్రల్ రైల్వే స్క్రాప్ విక్రయాల ద్వారా అసాధారణంగా రూ. 323.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దేశంలోని అన్ని జోనల్ రైల్వేలతో పోలిస్తే ఈ కాలంలో ఇదే అత్యధిక స్క్రాప్ విక్రయ ఆదాయం కావడం విశేషం. ఇక సెప్టెంబర్ నెల ఒక్క నెలలోనే ఏకంగా రూ. 70.42 కోట్ల విలువైన స్క్రాప్‌ను విక్రయించి, సెంట్రల్ రైల్వే చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.

22
ఇంతకీ ఏం అమ్మారు?

రైల్వేలో తుప్పుపట్టి పనికి రాకుండా మిగిలిపోయిన పాత రైల్వే ట్రాక్‌లు, ఇనుప సామగ్రి, పాత స్లీపర్లు, ఇతర మెటల్ వస్తువులను పక్కన పెట్టకుండా వేలం వేశారు. వీటితో పాటు.. ఉపయోగపడని 23 లోకోమోటివ్‌లు, 62 కోచ్‌లు, 70 వ్యాగన్లు దాదాపు 46.85 మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ (E-Waste) కూడా విక్రయించారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన 'స్వచ్ఛతా హి సేవా 2026' కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4,884 మెట్రిక్ టన్నుల స్క్రాప్‌ను తొలగించడం ద్వారా మరో రూ. 44.24 కోట్లు సమకూరాయి. మొత్తంగా ఈ ఆరు నెలల్లో 29,993 మెట్రిక్ టన్నుల రైల్ స్క్రాప్, 1.72 లక్షలకు పైగా పాత స్లీపర్లు, 15,547 మెట్రిక్ టన్నుల ఫెరస్ స్క్రాప్, 1,999 మెట్రిక్ టన్నుల నాన్-ఫెరస్ స్క్రాప్‌ను రైల్వే విజయవంతంగా విక్రయించింది.

డబ్బే కాదు.. స్థలం కూడా ఖాళీ!

ఈ స్క్రాప్ విక్రయాల వల్ల రైల్వేకు భారీగా ఆదాయం రావడమే కాకుండా, యార్డులు , డిపోలలో ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్న వేల ఎకరాల విలువైన స్థలం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ ప్రాంతాలను ఇతర కీలక రైల్వే అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించుకునే వెసులుబాటు లభించింది. పాత సామాన్లతో మొదలైన ఈ 'జీరో స్క్రాప్ మిషన్' ప్రయాణం రైల్వేకు నిజంగానే బంగారు బాటలుపరుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories