Jeans Planters: పాత జీన్స్ మూలన పడేసే కన్నా వాటిని మొక్కల కుండీలుగా మార్చుకోవచ్చు. ఇక్కడ పాత డెనిమ్ జీన్స్‌తో ప్లాంటర్లు ఎలా తయారు చేయాలో ఇచ్చాము. వీటితో మీ గార్డెన్‌కు క్రియేటివ్ లుక్ ఇవ్వొచ్చు.
ఇంట్లో జీన్స్ పాతవైపోతే బయటపడేస్తున్నారా? లేక చిరిగిపోయిందని వేసుకోవడం మానేస్తున్నారా? ఈ జీన్స్‌తోనే మీరు మంచి ప్లాంటర్లు తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడం కూడా చాలా సులువు. పాత ప్యాంట్లు పడేసి మీ గార్డెన్ లుక్ మార్చేయండి.
25
కోన్ ఆకారంలో జీన్స్ కుండీలు
జీన్స్‌తో మీరు హ్యాంగింగ్ ప్లాంటర్లు తయారు చేసి మీ గార్డెన్‌కు క్రియేటివ్ లుక్ ఇవ్వొచ్చు. జీన్స్‌ను కోన్ ఆకారంలో కట్ చేసి కుట్టండి. మిగిలిన క్లాత్‌తో వేలాడదీయడానికి తాడులా చేయండి. ఆ తర్వాత అందులో వైట్ సిమెంట్ వేసి గట్టిపర్చండి. ఇప్పుడు తక్కువ నీటితో బతికే అందమైన మొక్కను పెట్టండి.
35
జీన్స్ లోనే మొక్కలు
పాత జీన్స్, బూట్లు, సిమెంట్ ఉపయోగించి మీరు జీన్స్ ప్లాంటర్‌ను తయారు చేయవచ్చు. ముందుగా సిమెంట్ మిశ్రమాన్ని రెడీ చేసుకోండి. తర్వాత జీన్స్‌ను మీకు నచ్చిన ఆకారంలో పెట్టండి. జీన్స్ లోపల అచ్చు (mould) పెట్టి, అందులో సిమెంట్ మిశ్రమం నింపండి. అది ఆరిన తర్వాత, పైన ఖాళీగా ఉన్న చోట మొక్కను నాటండి.
ఈ యూనిక్ ప్లాంటర్‌ను పాత జీన్స్ లుక్‌తో స్ఫూర్తి పొంది తయారుచేశారు. ఇందులో క్రియేటివిటీ, DIY ఆర్ట్ అద్భుతంగా కనిపిస్తాయి. దీన్ని చేయడానికి, ముందుగా జీన్స్ ప్యాంట్ ఆకారంలో సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) లేదా రెజిన్‌తో ఒక అచ్చును (mould) తయారు చేస్తారు. అది ఆరిన తర్వాత, జీన్స్‌కు మెరుపు ఇవ్వడానికి అదే రంగుతో పెయింట్ చేస్తారు.
55
అందమైన చిట్టి ప్లాంటర్లు
మీరు ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటే, వాటి ప్లాంటర్లకు కవర్లు తయారు చేయవచ్చు. జీన్స్‌ను కట్ చేసి, వాటి సైజుకు సరిపోయేలా కవర్లు కుట్టండి. ఆ తర్వాత వాటిలో ప్లాంటర్లను పెట్టి ఇంటిని అందంగా మార్చుకోండి.