వీటితో శుభ్రం చేస్తే చాలు..
1.బేకింగ్ సోడా...
మురికిగా ఉన్న బాత్రూమ్ సింక్ పైపును శుభ్రం చేయాలనుకుంటే, మీరు బేకింగ్ సోడాను ఉపయోగించాలి. బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని మీరు పైపుకు పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత.. స్క్రబ్బర్ తో రుద్ది.. నీటితో కడిగితే సరిపోతుంది. మళ్లీ కొత్త పైపులా కనపడుతుంది.
2.వెనిగర్...
మురికిగా ఉన్న బాత్రూమ్ సింక్ పైపును శుభ్రం చేయడానికి మీరు వెనిగర్ ఉపయోగించొచ్చు. ఇది మురికి నొ తొలగించి, పైపును కొత్త దానిలా మెరిచేలా చేస్తుంది. వెనిగర్ ని పైప్ కి అప్లై చేసి.. బ్రష్ తో రుద్దితే సరిపోతుంది.
3. డిటర్జెంట్ పౌడర్
పైపును విడదీసి, దానికి డిటర్జెంట్ పౌడర్ పట్టించి, బ్రష్‌తో బాగా రుద్దండి. డిటర్జెంట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి పైపును శుభ్రం చేయాలి.
మురికిగా, జిగురుగా ఉన్న ఈ పైపును కనీసం నెలకు ఒకసారి లేదా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి. దీనివల్ల మురికి పేరుకుపోకుండా నివారించవచ్చు. పైపు చాలా కాలం పాటు శుభ్రంగా, మెరిసేలా ఉంటుంది.