
ప్రతి ఇంట్లో ఉదయాన్నే ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లే వారు, స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే ఆ హడావిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ ఉదయాన్నే లంచ్ బాక్స్ కోసం వంట చేయడం అంటే ఓ పెద్ద యుద్ధం గెలిచినట్లే. అసలే ఆఫీసు పని ఒత్తిడి, ఆ పై వంట చేయడానికి కిచెన్ లోనే గంటల సమయం గడిచిపోతూ ఉంటుంది. దీని వల్ల.. చాలా మంది వంట చేయడం అంటే ఒక ఒత్తిడి అయిపోతుంది. కానీ, కొన్ని సింపుల్ టెక్నిక్స్ తెలిస్తే.. వంట చేయడం చాలా ఈజీ. అలాంటి చిట్కాలు ఇప్పుడు చూద్దాం...
వెల్లుల్లి పొట్టు ఈజీగా తొలగించాలంటే...
వెల్లుల్లి పొట్టు వలవడం చాలా విసుగు పుట్టించే పని, తరచూ పొట్టు వేళ్లకు అంటుకుంటూ ఉంటుంది. వారి కోసమే ఈ ఈజీ ట్రిక్.
వెల్లుల్లి కింద భాగాన్ని (కాడ వైపు) కట్ చేసి కొన్ని రోజులు ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లోని చల్లదనం, తేమ వల్ల పొట్టు మెత్తబడి సులభంగా వచ్చేస్తుంది. రోజూ వంటల్లో వెల్లుల్లి వాడేవారైతే, రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి వారం మొత్తానికి సరిపడా ఫ్రిజ్‌లో దాచుకోవచ్చు. లేదా కొద్దిగా వేడి నీళ్లలో 10 నిమిషాలు నానబెట్టినా, మైక్రోవేవ్‌లో 10 సెకన్లు ఉంచినా పొట్టు క్షణాల్లో ఊడిపోతుంది.
అల్లం పొట్టు తీయడానికి స్పూన్ వాడండి.. అల్లం పొట్టు తీయడానికి కత్తి వాడితే పొట్టుతో పాటు అల్లం కూడా ఎక్కువ వృథా అవుతుంది. కత్తికి బదులుగా చిన్న స్పూన్ ఉపయోగించి అల్లాన్ని గీకండి. స్పూన్ వల్ల అల్లం వృథా కాకపోవడమే కాకుండా, అల్లం మడతలు, మూలల్లో ఉన్న పొట్టు కూడా చాలా తేలికగా వస్తుంది.
చాకు పదును పెట్టడానికి సిరామిక్ కప్పు.. పదును లేని చాకులతో కూరగాయలు కోయడం చాలా కష్టమైన పని. మీ ఇంట్లో ఉన్న సిరామిక్ (కాఫీ) కప్పును తిరగేసి, దాని అడుగు భాగం పై చాకు పదునైన అంచుని కొన్నిసార్లు రుద్దండి. చాకు మళ్లీ కొత్తదానిలా పదునుగా మారి కూరగాయలు సులువుగా కట్ అవుతాయి. మిక్సీ జార్ బ్లేడ్లు పదును తగ్గితే, అందులో గుప్పెడు రాతి ఉప్పు (కల్లు ఉప్పు) వేసి ఒక నిమిషం తిప్పితే బ్లేడ్లు పదునెక్కుతాయి.
మాడిపోయిన గిన్నెలు లేదా పాన్‌లను తోమడం చాలా కష్టమైన పని.
హ్యాక్: మాడిన పాత్ర అడుగున బేకింగ్ సోడా చల్లి, దానిపై 4-5 స్పూన్ల ఉప్పు వేసి, మునిగేలా నీళ్లు పోయండి. రాత్రంతా అలాగే నాననిచ్చి, ఉదయాన్నే రబ్బర్ స్పేటులా లేదా స్క్రబ్బర్‌తో గీకితే మాడిన కరక సులభంగా వదిలిపోతుంది.
5. నిమ్మ, నారింజ పండ్ల రసం ఎక్కువగా రావాలంటే.. నారింజ, బత్తాయి పండ్లు, నిమ్మకాయ నుంచి రసం తీయడం అంత ఈజీగా రాదు. ఈ చిన్న ట్రిక్ తో ఈజీగా జ్యూస్ వస్తుంది.
హ్యాక్: వీటిని కోసే ముందు నేలపై పెట్టి చేతితో కాస్త గట్టిగా రోల్ చేయండి లేదా కేవలం 1 నిమిషం మైక్రోవేవ్ చేయండి. దీనివల్ల పొట్టు వలవడం తేలికవుతుంది, రసం కూడా ఎక్కువగా వస్తుంది.
6. రాగి పాత్రల మెరుపు కోసం 'కెచప్'! మీ దగ్గర ఉన్న రాగి పాన్‌లు లేదా పాత్రల మెరుపు తగ్గిపోతే ఒక విచిత్రమైన కానీ అద్భుతమైన చిట్కా ఉంది.
హ్యాక్: రాగి పాత్రలపై పలుచగా టమోటా కెచప్ అప్లై చేసి కొద్దిసేపు ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో రుద్ది తుడిచేస్తే రాగి పాత్రలు కొత్తవాటిలా మెరిసిపోతాయి.
7. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా.. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే, వాటిని కోయడానికి 10-15 నిమిషాల ముందు ఫ్రిజ్‌లో ఉంచండి లేదా చల్లటి నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత కోయండి.
8. ఆకుకూరలు నిల్వ ఉంచే పద్ధతి కొత్తిమీర, పుదీనా త్వరగా పాడవకుండా ఉండాలంటే.. వాటి వేళ్లను తీసేసి, తడి లేకుండా తుడిచి ఎయిర్ టైట్ బాక్స్‌లో 'టిష్యూ పేపర్' పరిచి అందులో పెడితే వారాల తరబడి తాజాగా ఉంటాయి.
వంటగదిలో కష్టపడటం కంటే స్మార్ట్ వర్క్ చేయడం చాలా ముఖ్యం. ఈ చిన్న చిన్న చిట్కాలను మీ రోజూవారి దినచర్యలో భాగాలుగా మార్చుకుంటే, వంట చేయడం భారం కాదు. పని చాలా సులభం కూడా అవుతుంది.