Health Tips: అన్నానికి బదులుగా వీటిని తిన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు

Published : May 02, 2022, 01:58 PM IST

Health Tips: మన దేశంలో మూడు పూటలా అన్నాన్నే తినే వారు చాలా మందే ఉన్నారు. కానీ అన్నానికి బదులు కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ను తీసుకున్నా ఎంతో హెల్తీగా ఉంటారు. 

PREV
17
Health Tips: అన్నానికి బదులుగా వీటిని తిన్నా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు

మన దేశంలో మిగతా ఫుడ్ ఐటెమ్స్ కంటే రైస్ తో చేసిన అన్నాన్నే ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మూడు పూటలా అన్నం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇందులో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దీని వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే అన్నానికి బదులుగా వేరే ఇతర ఫుడ్ ఐటమ్స్ ను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

27

ధాన్యాలు.. రైస్ తోనే కాకుండా ఎన్నో రకాల కూరగాయలు, ధాన్యాలతో కూడా అన్నాన్ని చేసుకుని తొనొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..  

37
Quinoa Upma

క్వినోవా.. క్వినోవాలో ఎన్నో విలువైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో అమైనో ఆమ్లాలు అధిక మొత్తంలో ఉన్నాయి.  వివిధ ప్రోటీన్స్ తో పాటుగా ఖనిజాలు, మెగ్నీషియం, కాపర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తాయి. 

47

గోధుమ రవ్వ.. అన్నానికి బదులుగా గోధుమ రవ్వను కూడా తీసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వలో మాంగనీస్, మిటమిన్ బి6, ఫోలేట్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. దీన్ని తింటే బరువు పెరుగుతామన్న భయం కూడా లేదు. 
 

57

క్యాలీఫ్లవర్ రైస్.. అన్నానికి ప్రత్నామ్నాయంగా క్యాలీఫ్లవర్ రైస్ ను కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం క్యాలీఫ్లవర్ తురుములా చేసుకుని కొంచెం నూనెలో వేయించుకుంటే వేడి వేడిరైస్ తయారైనట్టే.  ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఐరన్, జింక్, విటమిన్ సి, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. 
 

67

ఇవి కూడా.. బార్లీ, కొర్రలు, రెడ్ రైస్ ను అన్నానికి  బదులుగా కూడా తీసుకోవచ్చు. వీటితో చేసిన అన్నాన్ని ఏ కూరతోనైనా తీసుకోవచ్చు. అన్నంగా కాకుండా కిచిడి, సలాడ్ గా  చేసుకుని కూడా తీసుకోవచ్చు. 
 

77

క్యాబేజీ.. క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తురుముకుని కొంచెం నూనె వేసి అందులో వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అంతే వేడి వేడి క్యాబేజీ రైస్ రెడి అయినట్టే. ఈ రైస్ లో వైట్ రైస్  లో కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. 

click me!

Recommended Stories