Hair Loss : ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఇక రాలమన్నా.. రాలదు తెలుసా..

Published : May 02, 2022, 11:50 AM IST

Hair Loss : తలకింద దిండు పెట్టుకునే అలవాటు వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోయే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. 

PREV
19
Hair Loss : ఈ జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఇక రాలమన్నా.. రాలదు తెలుసా..
hair falling

Hair Loss : వెంట్రుకలు ఊడిపోవడానికి వయసుతో సంబంధం ఉండదు. వివిధ కారణాల వల్లే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. పోషకాహారం తీసుకోకపోవడం, వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. 

29

ఆడవారికనే కాదు మగవారికి కూడా జుట్టంటే మహాప్రాణం. అందుకే జుట్టు కోసం రకారకాల షాంపూలు, నూనెలను ట్రై చేస్తుంటారు. కానీ ఏ ప్రొడక్ట్ వెంట్రుకలకు మంచి చేస్తుంది ఏది చేయదు.. అన్న విషయాలను తెలుసుకోకుండా వాడితే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉంది. జట్టుకు మంచి ప్రొడక్ట్స్ వాడుతూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే హెయిర్ ఫాల్ సమస్య నుంచి మీరు తొందరగా బయటపడగలుగుతారు. 
 

39
hair fall

సాధారణంగా హెయిర్ ఫాల్ కొన్ని రీజన్స్ వల్ల కలుగుతుంది. స్మోకింగ్ చేయడం, పెద్ద శస్త్రచికిత్స చేయించుకుని ఉండటం, ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు రాలుతుంది. 

49

జుట్టు రాలడానికి మరో కారణం మీ శరీరంలో ఆండ్రోజెన్ హార్మోన్ లేకపోవడం. జడను బిగ్గరగా వేసుకుంటే కూడా జుట్టు రాలుతుంది. బిగ్గరగా జడను అల్లడం వల్ల జుట్టు రాపిడికి గురై జుట్టు జీవం లేనట్టుగా మారి.. క్రమ క్రమంగా రాలిపోతుంది. 

59

పోనిటైల్ వేసుకున్నా వదులుగానే వేసుకోవాలి. ఎందుకంటే బిగుతుగా జుట్టు వేసుకుంటే కుదుళ్లు పటుత్వం కోల్పోయి విపరీతంగా రాలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

69

ఇకపోతే తలకింద దిండు వేసుకుని పడుకునే అలవాటుంటే వెంటనే మానుకోమని నిపుణులు సలహానిస్తున్నారు. ఎందుకంటే తలకింద దిండు పెట్టుకోవడం వల్ల జుట్టు రాపిడికి గురవుతుంది. దీంతో జుట్టు రాలిపోతుంది. ఒకవేళ దిండు లేకుండా పడుకోలేమంటే దిండుపై సిల్క్ కవర్ ను కప్పి దానిపై పడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. 

79

ఇకపోతే జుట్టుకు వాడే కండీషన్ల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల కండీషనర్లు జుట్టుకు హానీ చేస్తాయి. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఉంది. 

89

జుట్టుకు షాంపూలకు బదులుగా కుంకుడు కాయ, షీకాయ వంటివి పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, షైనీగా తయారవుతుంది. అలాగే మార్కెట్లోకి ఏది నూనె కొత్తగా వస్తే దాన్ని వాడే అలవాటును మానుకోండి. అన్నింటికంటే కొబ్బరి నూనె, ఆముదం జుట్టుకు చాలా మంచివి. వీటివల్ల జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. 

99

మీ ఆరోగ్యం బాగుంటేనే మీ జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. ఒకవేళ మీరు అతిగా ఆలోచిస్తూ.. ఒత్తిడికి గురయ్యారో ఎన్నో అనారోగ్య సమస్యలతో పాటుగా జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ. పోషకాహారం తీసుకుంటే మీ జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మీ జుట్టు అస్సలు ఊడిపోదు. 


 

click me!

Recommended Stories