వర్షాకాలం రాగానే ఎక్కడ చూసినా నీరు, మురికి పేరుకుపోతాయి. దీనివల్ల అక్కడ పురుగులు, కీటకాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ పురుగులు, కీటకాలను తింటూ ఇంట్లో బల్లులు స్వేచ్చగా తిరుగుతుంటాయి. ఈ బల్లులు ఇంటిని మురికిగా మార్చేస్తాయి. అలాగే ఆహారపదార్థాలపైకి కూడా వెళుతుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ఇవి మనల్ని అనారోగ్యం బారిన కూడా పడేస్తాయి. మీకు తెలుసా? బల్లి మలం, లాలాజలంలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వంటింట్లో ఉండే బల్లులు ఆహారంలో పడితే ఆహారం విషతుల్యంగా మారి ఆ వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది. అందుకే ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.