ఈ లెహంగాలతో పెళ్లి కూతురి ముస్తాబులో మెరిసిపోండి..

First Published | Aug 9, 2021, 12:05 PM IST

వధువు వేసుకునే లెహంగా ఆమె అందాన్ని మరింత వన్నె తెస్తుంది. కొన్నిసార్లు ఇది మిస్ ఫైర్ అయి పూర్తిగా పెళ్లి కళనే దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. అందుకే సరైన లెహంగాలు.. ఇప్పటి ట్రెండ్ కు తగ్గవి.. అలాగని మరీ మీకు నప్పనివి కాకుండా ఎంచుకోవాలి. 

పెళ్లి... ప్రతి అమ్మాయి జీవితంలో ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితాన్ని మలుపుతిప్పే రోజు. కొత్త జీవితానికి.. సరికొత్త ఆశలకు చిగురులు తొడిగే రోజు. అందుకే ప్రతీ అమ్మాయి తన పెళ్లి రోజునాడు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటుంది. పెళ్లి కూతురి గెటప్ లో అద్బుతంగా మెరవాలని ప్రయత్నిస్తుంది.
undefined
ఈ నేపథ్యంలో వధువు వేసుకునే లెహంగా ఆమె అందాన్ని మరింత వన్నె తెస్తుంది. కొన్నిసార్లు ఇది మిస్ ఫైర్ అయి పూర్తిగా పెళ్లి కళనే దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. అందుకే సరైన లెహంగాలు.. ఇప్పటి ట్రెండ్ కు తగ్గవి.. అలాగని మరీ మీకు నప్పనివి కాకుండా ఎంచుకోవాలి.
undefined

Latest Videos


ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. పెళ్లి కూతుర్లు షాపింగ్ కు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో 2021 ట్రెండింగ్ లెహంగాలు ఏవో మీరు తెలుసుకుంటే... పెళ్లి కూతురిగా మెరిసి పోవచ్చు. దీనికోసం స్పెషలిస్ట్ అవ్నికా మిలన్ ఈ రోజుల్లో ట్రెండ్ అవుతున్న లెహంగా డిజైన్‌లు చెప్పుకొచ్చారు..
undefined
క్లాసిక్ రెడ్ లెహంగా : పెళ్లి రోజున మహారాణిలా మెరిసిపోవాలంటే... అందరి దృష్టిలోనూ ప్రత్యేకంగా, అందంగా, అద్భుతంగా ఉండాలంటే క్లాసిక్ రెడ్ లెహంగా కంటే ప్రామాణికమైనది. సాంప్రదాయమైనది ఏదిలేదు. పూర్తి ఎంబ్రాయిడరీ స్కర్ట్ తో సాంప్రదాయ రెడ్ లెహంగా.. దాని మీదికి ప్రత్యేకంగా ఆభరణాలతో తయారు చేయించిన బ్లౌజ్... మిమ్మల్ని మరింత మెరిసిపోయేలా చేస్తుంది.
undefined
పేస్టల్ ఎంబ్రాయిడరీ లెహంగా : ఈ మధ్య కాలంలో చాలామంది సంప్రదాయ లెహంగాలు ఇష్టపడడంలేదు. పెళ్లి రోజు కూడా ఏదో ప్రత్యేకంగా ఉండాలని చూస్తున్నారు. ఇలాంటి వారికోసం పేస్టల్ ఎంబ్రాయిడరీ లెహంగాలు మంచి ఆఫ్షన్. లిలక్, క్రీమ్‌, పింక్‌లాంటి అన్ని పేస్టల్ రంగుల మిశ్రమంతో ఉండే లెహంగాను ఎంచుకోవచ్చు.
undefined
ఫుచ్సియా మిర్రర్ వర్క్ లెహంగా : బట్టలు అందంగా, వైబ్రెంట్ గా కలర్ ఫుల్ గా ఉండాలని ఇష్టపడేవ్యక్తి మీరు అయితే.. మీకు సరైన ఆఫ్షన్ ఫుచ్సియా మిర్రర్ వర్క్ లెహంగా లే. మా బబ్లీ నెస్ కి... మిర్రర్ వర్క్ లెహంగా చక్కగా సూటవుతుంది. ఇది మరీ అంత తేలికగా లేదా బరువుగా ఉండదు. దీనివల్ల పెళ్లి కూతురి డ్రెస్సులో కూడా రాత్రంతా డ్యాన్స్ చేయవచ్చు.
undefined
రాజపుతానా లెహంగా : ఒక పెద్ద రాజభవనంలో రాజ్‌పుతన వధువులా ఉండాలని కలలు కనే అమ్మాయిలకు సరిగ్గా సరిపోయే లెహంగా ఇది. స్థానిక హస్త కళాకారులతో తయారుచేయబడిన సాంప్రదాయక లెహంగాలను ఎంచుకోండి. లైట్ కలర్ కి ముదురు రంగు కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇది పూర్వీకుల లుక్ ను ఇస్తుంది. పోస్ట్‌కార్డ్ వెడ్డింగ్ ఫోటోలు లుక్ మీ వెడ్డింగ్ ఫోటోలకు ఇస్తుంది. దీనికి ఫ్యాషన్ లుక్ ఇవ్వడానికి బెల్ట్‌తో యాక్సరైజ్ మిడ్‌రిఫ్ చుట్టూ పెట్టండి.
undefined
మెహందీ, హల్దీ ఫంక్షన్‌ల కోసం ఎలా తయారవ్వాలా అన్న గందరగోళంలో ఉన్నారా? అయితే ఆలివ్ కలర్ లెహంగా స్కర్ట్‌తో బెలూన్ స్టైల్ బ్లౌజ్‌ని ప్రయత్నించవచ్చు. దీనికి జుట్టును వదులుగా వదిలేయడం లేదా కర్ల్స్ చయడం బాగుంటుంది.
undefined
మెహందీ వేడుక కోసం, ఇండో వెస్ట్రన్ లుక్ కలిగిన పుదీనా, ముదురు ఆకుపచ్చ లెహంగా ల ట్రెండింగ్ కాంబినేషన్ ను ప్రయత్నించండి. తేలికపాటి లెహంగాలైతే మీ పెళ్లిలో మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా నృత్యం చేయడానికి సౌకర్యంగా ఉంటాయి.
undefined
click me!