తంజావూరులో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published Dec 31, 2021, 5:22 PM IST

తంజావూరులో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. తంజావూరు అనేక చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి. తంజావూరులోని అనేక సందర్శనీయ ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు భారత దేశంలోని నలుమూలల నుంచి వస్తుంటారు. తంజావూరులో ప్రధాన ఆకర్షణగా దేవాలయాలు, కోటలు, గ్రంథాలయాలు, చర్చిలు మహల్ లు ఇలా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటి సందర్శన మనకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. మీరు తంజావూరుకు వెళ్ళినప్పుడు సందర్శనకు వీలుగా ఉండే కొన్ని ప్రదేశాలు గురించి తెలుసుకుందాం..

తంజావూరులో బ్రహదేశ్వర ఆలయం, విజయనగర కోట, సరస్వతీ మహల్ గ్రంథాలయం, ఆర్ట్ గ్యాలరీ, సంగీత మహల్, మనోరా ఫోర్ట్,  స్క్వార్జ్ చర్చి, మురుగన్ స్వామి ఆలయం వంటి సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ సందర్శనీయ ప్రదేశాలు ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను కలిగి పర్యాటకులు ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

బ్రహదేశ్వర ఆలయం: తమిళ నిర్మాణ కళలో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో బ్రహదేశ్వర ఆలయం ఒకటి. ఇది చోళుల కాలంలో నిర్మించబడిన అద్భుతమైన కట్టడం. ఈ ఆలయాన్ని శివుడికి అంకితం ఇస్తూ కట్టబడిన ఆలయం. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావన కలిగి మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది.
 

విజయనగర కోట: బ్రహదేశ్వర ఆలయం ఈశాన్య ప్రాంతంలో రెండు కిలోమీటర్ల దూరంలో విజయనగర కోట ఉంది. ఈ కోట 16వ శతాబ్దానికి చెందినది. కోట లోపల అనేక శిల్ప కళలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.  తంజావూరులో విజయనగర కోట ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ సందర్శన మీకు తప్పక నచ్చుతుంది.
 

సరస్వతీ మహల్ గ్రంథాలయం: తంజావూరులోని అతిపెద్ద పురాతన గ్రంథాలయంగా సరస్వతీ మహల్ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయంలో మరాఠీ, తమిళ, తెలుగు, ఆంగ్ల భాషలలో అచ్చు కాబడిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి. 1918 సంవత్సరంలో ఈ గ్రంథాలయం తమిళనాడు రాష్ట్ర నియంత్రణలో ఉంది.
 

సంగీత మహల్: తంజావూరులో ప్రధాన ఆకర్షణగా సంగీతం హాల్ ఉంది. సంగీత మహల్ లో మొదటి అంతస్తులో తంజావూరు ప్యాలెస్ ఉంది. ఈ మహల్ ను 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ మహల్ ను చోళ, నాయక్ పాలకుల కాలంలో  వివిధ సంగీత కళాకారులు, నృత్య కారులు ప్రదర్శనల కోసం ఉపయోగించేవారు.
 

మనోరా ఫోర్ట్: మనోరా అనే పదం మీనార్ నుండి తీసుకోబడినది. ఈ ఫోర్ట్ తంజావూరుకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఫోర్ట్ ఎత్తు  సుమారు 23 మీటర్లు, ఆరు కోణాల గల టవర్. ఈ ఫోర్ట్ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం, పార్కులు ఇతర ఆకర్షణీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఫోర్ట్ 2004 హిందూ మహాసముద్ర సునామీ ఏర్పడినప్పుడు కోట దెబ్బతింది. తిరిగి ఈ కోటను మరమ్మత్తు చేశారు.

click me!