రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 14, 2021, 03:50 PM IST

అల్వార్ రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో ఉంది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్వత ప్రాంతం. ఇది రాజస్థాన్ కి వాయువ్యాన ఉన్న ఆరావళి పర్వత పంక్తులలో రాళ్లు రప్పల మధ్య ఉన్న ప్రదేశం. అల్వార్ (Alwar) ఒక అందమైన ప్రదేశం. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇవి యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశాలను చూడటానికి ప్రపంచంలోని నలుమూలల నుండి యాత్రికులు వస్తారు. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా రాజస్థాన్ లో ఉన్న అల్వార్ లో చూడవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..  

PREV
14
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఖచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

పురాణాల్లో ఈ ప్రాంతాన్ని మత్స్య దేశంగా పిలిచేవారు. ఈ ప్రదేశంలో పాండవులు తమ అరణ్యవాసంలో గడిపారని మహాభారతంలో తెలియజేయడం జరిగింది. ఇక్కడి అందమైన సరస్సులు (Lakes), పెద్ద పెద్ద భవంతులు, స్మారక కట్టడాలు (Monuments), ఆలయాలు యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. దీనితో పాటుగా ఇక్కడికి వచ్చే పర్యాటకులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సరిస్కా అనే ప్రాంతాన్ని తప్పక చూడాలి.
 

24

సరిస్కా (Sariska) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని చూడడానికి యాత్రికులు  ప్రపంచంలోని నలుమూలల్లో నుంచి వస్తుంటారు. అల్వార్ ను చారిత్రకంగా మేవార్ (Mewar) అని కూడా అంటారు. అల్వార్ లో చూడవలసిన ప్రధాన ప్రదేశాలు భాస్ గర్హ్ కోట, బాల ఖిలా కోట. ఇప్పుడు మనము ఈ పర్యాటక ప్రదేశాలు, ఆకర్షణ కట్టడాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

34

భాస్ గర్హ్ కోట: రాజస్థాన్ లోని ఆల్వార్ (Alva) జిల్లాలో భాస్ గర్ పట్టణం ఉంది. ఈ పట్టణంలో భాస్ గర్హ్ కోట ఉంది. క్రీ.శ. 1613 ఈ కోట నిర్మాణం జరిగింది. అంబర్ కు చెందిన గొప్ప మొగల్ సేనాని మాస్ సింగ్ కుమారుడు మాధవ్ సింగ్ నిర్మించాడు. ఈ కోట ఒక కొండ గొడుగులా ఉండి మిగిలిన ప్రాంతాల కంటే వేరుగా ఉంటుంది. అనేక శతాబ్దాల నుండి ఈ పట్టణంలో, కోటలోనూ దెయ్యాలు (Demons) ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత ఈ ప్రాంతంలో ప్రవేశం నిషిద్ధం.
 

44

బాల ఖిలా కోట (Bala khila fort): అల్వార్ లో ఇది ఒక ప్రసిద్ధి చెందిన కట్టడం. దీన్ని అల్వార్ కోట అని కూడా పిలుస్తారు. దీన్ని హాసన్ ఖాస్ మేవాటి క్రీ. శ. 1550 వ సంవత్సరంలో అద్భుతమైన నమూనాతో ఇతర రాజులు ఈర్ష పడే విధంగా కట్టించాడు. ఈ కోట ఉత్తరం నుండి దక్షిణానికి 5 కి.మీలు తూర్పు నుండి పడమరకు 2 కి.మీలు విస్తరించి ఉంది. ఈ కోటకు ఆరు ప్రత్యేకమైన ద్వారాలు (Gates) ఉన్నాయి. ఈ కోటకు తుపాకులు పేల్చేందుకు 446 గోడలోనే ఉంచిన రంధ్రాలు ఉన్నాయి.15 పెద్ద స్తంభాలు, 51 చిన్న స్తంభాలు ఉన్నాయి. దీనిని మొగలుల కాలంలో నిర్మించారు.

click me!

Recommended Stories